కారు అదుపుతప్పి యువకుడు మృతి
మునగాల: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో యువకుడు మృతిచెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్సై వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖలీల్(25) తన స్నేహితులు మహమ్మద్ కై సర్ అలీ, అబ్దుల్లా అంజద్, దిలీప్‌కుమార్‌లు కలిసి కారులో డ్రైవర్ మహ్మద్ యాసిన్‌తో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో మహ్మద్ అబ్దుల్ ఖలీల్ డ్రైవర్‌ను పక్కకు తప్పించి కారు నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మునగాల మండలం బరాఖత్‌గూడెం వద్ద గల ఫ్‌లైౖఓవర్ పైకి చేరుకున్న తర్వాత అబ్దుల్ ఖలీల్ కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అబ్దుల్ ఖలీల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులు అతడిని 108వాహానంలో చికిత్స నిమిత్తం కోదాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి బాబాయి మహ్మద్ అబ్దుల్ హబీబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటరత్నం తెలిపారు.
కారు అదుపుతప్పి యువకుడు మృతి


