విజ్ఞానం.. వినోదం.. వికాసం
కంప్యూటర్‌పై అవగాహన ఏర్పడింది
ఆత్మకూర్(ఎం) కేజీబీవీలో 9వ తరగతి పూర్తిచేశాను. అమ్మాయిలకు సమ్మర్ క్యాంప్ ద్వారా కోర్సులు నేర్పిస్తున్నారని మా టీచర్ చెపితే ఇక్కడ జాయిన్ అయ్యాను. క్యాంప్ ద్వారా కంప్యూటర్‌లో బేసిక్, స్పీడ్ మ్యాథ్స్, డ్యాన్స్ నేర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
–జ్యోత్స్న, ఆత్మకూర్(ఎం) కేజీబీవీ
ఫ్రెండ్స్‌సర్కిల్ పెరిగింది
మాది సూర్యాపేట. చౌటుప్పల్ కేజీబీవీలో చదువుతున్నా. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లలేదు. ఆడుతూ పాడుతూ సమ్మర్‌క్యాంప్ ద్వారా డ్రాయింగ్, మ్యుజిక్, మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని కేజీబీవీల విద్యార్థులు రావడంతో మంచి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరిగింది.
– తేజస్వి, చౌటుప్పల్
సంగీతం నేర్చుకుంటున్నా
నేను 9వ తరగతి పూర్తి చేశాను. అంతకుముందు సంగీతం గురించి కనీస పరిజ్ఞానం లేదు. ఇక్కడికి వచ్చిన తరువాతనే సరిగమలు, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించి పంపించారు. వేసవి సెలవులు వృథా కాకుండా కొత్త కోర్సులను నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. –అక్షిత, బొమ్మలరామారం
కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిక్షణ
ఫ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రాధాన్యం
ఫ వసతి, భోజన సదుపాయం
ఫ 120 మంది బాలికలు హాజరు
ఫ జలాల్‌పురం కేజీబీవీలో
ఈనెల 19 వరకు సమ్మర్ క్యాంప్
భూదాన్‌పోచంపల్లి : వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదం పంచుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులకు ఉచితంగా పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు.
11మండలాల నుంచి విద్యార్థినుల రాక
భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, అడ్డగూడురు మొత్తం 11 మండలాల కేజీబీవీల నుంచి 120 మంది బాలికలు శిక్షణలో పాల్గొంటున్నారు. 15 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. డ్రాయింగ్, క్రాప్ట్ మెటీరియల్, పుస్తకాలు వారే అందిస్తున్నారు. అలాగే మెనూ ప్రకారం ఉచిత భోజన సదుపాయం కల్పించారు.
నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం
జలాల్‌పురం కేజీబీవీలో 11 మండలాలకు చెందిన 120 మంది విద్యార్థినులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. శారీరక ధృఢత్వం, మానసిక వికాసం, నైపుణ్యాలు పెంపొందించే కోర్సులలో ప్రత్యేక శిక్షకుల ద్వారా శిక్షణ అందిస్తున్నాం. ఆటపాటలతో నేర్చుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. పాఠశాలలు పునః ప్రారంభించేనాటికి పిల్లలు మాససికంగా రీఫ్రెష్ కావడానికి సమ్మర్ క్యాంపు దోహదపడుతుంది.
–ఇందిర, జలాల్‌పురం
కేజీబీవీ ప్రత్యేక అధికారిణి
ఈ కోర్సుల్లో శిక్షణ
కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు గణిత సమస్యలను సులభంగా సాధించే మెళకువలు (రీజనింగ్ మ్యాథ్స్), మెంటల్ ఎబిలిటీ, పోటీ పరీక్షల ప్రిపరేషన్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తూ విజ్ఞానం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. అదేవిధంగా డ్రాయింగ్, క్రాప్ట్, క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్, యోగా, క్రీడలతో పాటు లలితకళలలో శిక్షణ ఇస్తూ విద్యార్థులలో శారీక, మానసిక ఉల్లాసం కల్గించేలా శిక్షణ ఇస్తున్నారు.
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం
విజ్ఞానం.. వినోదం.. వికాసం


