కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. 2025లో ఎన్నో ఘటనలు జ
జనవరి
● 5న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీబీనగర్‌లోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు.
● 10న చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతిచెందగా 19 మందికి గాయాలయ్యాయి.
● 27న బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు మహాధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
ఫిబ్రవరి
● 16న చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రారంభమై 20న ముగిసింది.
● 22న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇన్‌లెట్‌లో సొరంగం లోపల పైకప్పు కుప్పకూలి ఎనిమిది కార్మికులు మృతిచెందారు.
● 23న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
● 27న ఉపాధాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.
మార్చి
● 10న దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఆరున్నరేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుగా తేల్చి.. ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్‌శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది.
● 18న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా సందర్శించారు.
● 30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారు. ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌తో కలిసి ప్రారంభించారు.
ఏప్రిల్
● 2న భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామ పరిధిలో చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బీటెక్ విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
● 9న చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్ద ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులో ఉన్న రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
● 11న ముద్ర లోన్ పొంది వస్త్ర వ్యాపారాన్ని విస్తరించిన హుజూర్‌నగర్‌కు చెందిన సృజన.. ఢిల్లీలో ప్రధాని చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
● 20న పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే సభ విజయవంతానికి సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
● 21న నకిరేకల్‌లో టెన్త్ పరీక్ష కేంద్రంలో తెలుగు ప్రశ్నపత్రం లీకయ్యింది.
● 29న మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు.
మే : ● 12న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు నాగార్జునసాగర్‌ను, 15న భూదాన్‌పోచంపల్లిలో చేనేత వస్త్ర తయారీని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
జూన్
● 6న తుర్కపల్లి మండలం తిర్మలాపూర్‌లో జరిగిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
● 9న సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు.
● 12న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ భూదాన్‌పోచంపల్లిని సందర్శించి చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు.
● 26న కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
జూలై
● 14న సీఎం రేవంత్‌రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.
● 18న నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించి విద్యుదుత్పత్తిపై అధికారులతో సమీక్షించారు.
● 21న సూర్యాపేట పట్టణంలోని శ్రీసాయి సంతోషి జ్యువెల్లరీ షాపులో ఎనిమిది కిలోల బంగారు ఆభరణాల చోరీ జరిగింది.
● 26న చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు.
ఆగస్టు
● 1న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
సెప్టెంబర్
● 5న పెన్‌పహాడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు మారం పవిత్ర రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్నారు.
● 15న మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు.
అక్టోబర్
● 1న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 4న అంత్యక్రియలను తుంగతుర్తిలో నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
● 12న తుంగతుర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.
● 24న కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గుండాల మండలం వస్తాకొండూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూషారెడ్డి సజీవ దహనమైంది.
● 30న భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లిలోని సప్తవర్ణి గోశాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు.
నవంబర్
● 22న మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించింది.
● 26న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
డిసెంబర్
● 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
● 10న పంచాయతీ ఎన్నికల సందర్భంగా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడి హత్య జరిగింది. ఇది తీవ్ర కలకలం రేపింది.
● 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకున్నారు.
● 18న నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు భువనగిరిలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.
● 23న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు నల్లగొండలో జరిగిన సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
● 29న యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్‌యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
– సాక్షి నెట్‌వర్క్
కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. 2025లో ఎన్నో ఘటనలు జ


