
ప్రభుత్వ భూములు అమ్మినా.. కొన్నా నేరమే
ఆత్మకూరు(ఎం): నిరుపేద రైతుల జీవనోపాధి కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మినా, కొన్నా నేరమే అవుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా బుధవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు కొరటికల్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. తక్కువ ధరకు వస్తాయని అసైన్డ్‌మెంట్ భూములను కొనుగోలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. భూసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అంతకుముందు ఆత్మకూరు(ఎం) రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ వి.లావణ్య, వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సదస్సుల్లో ఆత్మకూరు(ఎం) డీటీ ఎండీ. షఫియొద్దీన్, భువనగిరి డీటీ ప్రణయ్, ఆర్‌ఐలు వై.మల్లిఖార్జునరావు, పాండు, మండల సర్వేయర్ స్వప్న, కంప్యూటర్ ఆపరేటర్ వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు