
యాదగిరి కొండపై కార్పెట్‌లు, మ్యాట్‌లు
యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. మాడ వీధుల్లో పరుగులు తీసే పరిస్థితి ఉంది. సమస్య పరిష్కరించేందుకు నూతన ఈఓ వెంకట్రావ్ చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతంలో పర్యటించి భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండ తీవ్రతకు కాళ్లు కాలుతున్నాయని, పరుగులు తీయాల్సి వస్తుందని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు బస్టాండ్, మాడ వీధుల్లో ఆదివారం కాయిర్ మ్యాట్‌లు, కార్పెట్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే లక్ష్యమని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని ఈఓ తెలిపారు.
ఫ భక్తులకు కాళ్లు కాలకుండా ఏర్పాటు