‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు! | - | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!

May 16 2025 1:48 AM | Updated on May 16 2025 1:48 AM

‘అమృత

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!

గడువులోపు పూర్తిచేయాలి

మున్సిపాలిటీల్లో రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమృత్‌ 2.0 పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. పనులు సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. గడువులోపు పనులను పూర్తి చేసి పట్టణవాసులకు తాగునీరు అందించాలి.

–చాడ మంజుల, బీజేపీ

మోత్కూరు పట్టణ అధ్యక్షురాలు

నిరంతరం పర్యవేక్షించాలి

అమృత్‌ పథకం పనులు గడువులోపు పూర్తి చేయాలి. మధ్యలో నిలిచిపోకుండా అధికారులు పర్యవేక్షిస్తుండాలి. అంతేకాకుండా ట్యాంకుల నిర్మాణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలి. నిలిచిపోయిన ట్యాంకుల పనులను త్వరగా పునఃప్రారంభించాలి

–చొల్లేటి నరేష్‌, మోత్కూరు

కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం

పనుల్లో జాప్యం వాస్తవమే. ఇప్పటికే కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. పనులు దక్కించుకున్న మెయిన్‌ కాంట్రాక్టర్‌.. వాటిని సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకున్నాడు. జాప్యంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

–సురేష్‌, ఏఈ, పబ్లిక్‌ హెల్త్‌ విభాగం

మోత్కూరు : మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చి, భవిష్యత్‌లో సమస్య రాకుండా ఉండేందుకు కేంద్రం తీసుకువచ్చిన అమృత్‌ పథకం పనులు అగమ్యగోచరంగా మారాయి. పనులు ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా నేటికీ ట్యాంకులే పూర్తి కాలేదు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

రూ.12 కోట్లు మంజూరు

మోత్కూరు మున్సిపాలిటీకి అమృత్‌ 2.0 పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్రం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆరున్నర లక్షలు, ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు, వాటికి ప్రహరీలు, 12 కిలో మీటర్ల దూరం పైపులైన్‌ నిర్మాణంతో పాటు సుమారు వెయ్యి నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. 2050 సంవత్సరం వరకు పట్టణంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2024 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ట్యాంకుల నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ శంకుస్థాపన చేశారు. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ టెండర్‌ ద్వారా పనులు దక్కించుకుంది. పనులు పూర్తి చేయడానికి రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకొని 2024 ఏప్రిల్‌లో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరున్నర లక్షలు, జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు నిర్మిస్తున్నారు. జూనియర్‌ కాలేజీలో వాటర్‌ట్యాంక్‌ గ్రౌండ్‌ లెవల్‌, కాంక్రీట్‌, స్టీల్‌ పనుల వరకు పూర్తయ్యాయి. హైస్కూల్‌లో గ్రౌండ్‌ లెవల్‌ వరకు మట్టి నింపారు. కాగా మూడు నెలలుగా ట్యాంకుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

ఏడాదిన్నర కావొస్తున్నా సగం దాటని లక్ష్యం

ఫ ట్యాంకుల స్థాయిలో నిలిచిపోయిన పనులు

ఫ పెట్టుబడికి డబ్బుల్లేవని చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

ఫ నోటీసులు ఇచ్చామంటున్న అధికారులు

కారణాలివీ!

పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. ముందస్తుగా సొంత డబ్బులతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. అయితే సబ్‌ కాంట్రాక్టర్‌ వద్ద పెట్టుబడికి సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల పనులు నిలిపివేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్‌ బాధ్యతారహితంగా పనులు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పథకం పనులు పూర్తయ్యాక ఐదేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా కాంట్రాక్టరు చేయించాల్సిన బాధ్యత ఉంది.

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!1
1/3

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!2
2/3

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!3
3/3

‘అమృత్‌’కు ఆరు నెలలే గడువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement