
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
చౌటుప్పల్ : విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలంలో రూ.3.29కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలు బాగుంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విద్య, వైద్యం కోసం తాను రాజీ పడబోనని, ఈ రెండు రంగాల్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తానన్నారు. చదువుతోనే సమాజాభివృద్ధి సాధ్యమని.. హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించి వాటి రూపురేఖలు మారుస్తామన్నారు.కేజీబీవీ పరిసరాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, తహసీల్దార్ హరికృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ పజ్జూరు సిద్ధార్థర్దకుమార్, కేజీబీవీ ప్రత్యేకాధికారి భవానీ, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి