
సప్లిమెంటరీకి సన్నద్ధత ఏదీ?
కార్యాచరణ ఇదీ..
● మండలా వారీగా ఫెయిలైన విద్యార్థులను గుర్తించాలి.●
● విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకోవాలి.
● విద్యార్థులకువాట్సప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి.
● ఎక్కువ మంది ఫెయిలైన పాఠశాల విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్చించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కానీ, ఇప్పటి వరకు అమలు కావడం లేదు.
భువనగిరి : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులపై దృష్టి కొరవడింది. ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ అమలులో జాప్యం జరుగుతోంది. పరీక్షలకు గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులే స్వతహాగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఫెయిలైన విద్యార్థులు 199 మంది
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. పరీక్షలకు 8,631 మంది విద్యార్థులు హాజరు కాగా 8,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 199 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 75 మంది ఉన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీలో పాసయ్యేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఉన్నతస్థాయి ఆదేశాలున్నాయి.
ఎక్కువగా తెలుగు, గణితంలో..
తెలుగు, గణితం, ఆ తరువాత ఇంగ్లిష్, సైన్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
పరీక్షలకు తక్కువ వ్యవధి
జూన్ 14నుంచి 22వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వ్యవధి తక్కువగా ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ లోనే ఉంటున్నారు. దీంతో కార్యాచరణ అమలులో జాప్యం జరుగుతుంది.
ఫ జూన్ 14నుంచి పదో తరగతిఅడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఫ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం
ఫ అమలు చేయడంలో జాప్యం