
యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వారా బంధనం చేశారు.
పంటల మార్పిడితో అధిక దిగుబడులు
భువనగిరి : రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ.. సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎం యాకాద్రి అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల మార్పిడి విధానం తో నేల సారం పరిరక్షించబడుతుందన్నారు. పరిమిత నీటితో సాగు చేయవచ్చన్నారు. అనంతరం పంటల సాగు విధాన పై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్‌కుమార్ అవగాహన కల్పించారు. వ్యవసాయ సాగులో మెలుకువలకు సంబందించి పాటించవల్సిన నియామలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు మధుశేఖర్, భూగర్భ నీటి విభాగం అధికారి అశ్విత్, ఏఓ మల్లేష్, ఏఈఓ మల్లేష్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, మాజీ ఎంపీటీసీ కొండల్‌రెడ్డి, అభ్యుదయ రైతులు సిద్దారెడ్డి,రాములు, కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ కృష్ణయ్య, విజయకాంత్, రూప తదితరులు పాల్గొన్నారు.
యువ వికాసం దరఖాస్తుల పరిశీలన
ఆలేరురూరల్: యువ వికాసం పథకం దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు. బుధవారం ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను వారు పరిశీలించి మాట్లాడారు. ఆలేరు మండల పరిధిలో 1,809 దరఖాస్తులు చేసుకోగా ఇందులో 1,425 మంది ఎంపీడీఓ కార్యాలయంలోనే అందజేశారని ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ తెలిపారు. వారి వెంట మండల స్పెషల్ అధికారి గోపాల్ తదితరులు ఉన్నారు.
అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ సూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్ దరఖాస్తుల స్వీకరణ, 2024–25 విద్యా సంవత్సరం సాధించిన ఫలితాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, డీటీడీఓ శంకర్ పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు

యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు