
తెలంగాణ ఉద్యమాన్ని రాజేసింది కళాకారులే..
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ కళాకారులందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని రాజేసింది కళాకారులేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారులు లేకుండా ఏసభ జరగదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాంస్కృతిక సారధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. సభా వేధికపై గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాకారుడు గణేష్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, ఏపూరి సోమన్న, కళాకారులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య