
ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు
భూదాన్‌పోచంపల్లి: మిస్‌వరల్డ్ పోటీదారుల సందర్శనతో పోచంపల్లి ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం పోచంపల్లి టూరిజం పార్కును ఆయన సందర్శించారు. ఈనెల 15న మిస్‌వరల్డ్ పోటీదారులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. చేనేత మ్యూజియం, హంపీ థియేటర్, స్టాల్స్ ఏర్పాటు ప్రదేశం, ప్రధాన ద్వారం వద్ద స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా సమీప దేశాలకు చెందిన 25 మంది పోటీదారులు 15న సాయంత్రం 6గంటల లోపు పోచంపల్లికి చేరుకుంటారన్నారు. వీరికి కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారన్నారు. అనంతరం మ్యూజియంలో కొకూన్స్ నుంచి దారం, దారం నుంచి వస్త్రం ఎలా తయారవుతుందో ప్రత్యక్షంగా చూస్తారని తెలిపారు. అనంతరం హంపీ థియేటర్‌లో సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్‌తో పాటు మన చేనేత వస్త్రాలను ఆధునిక యుగంలో ఇంకా మోడ్రన్ ఎలా చూపించవచ్చునో ఉదాహరణగా ఇండోవెస్ట్రన్‌లో ఫ్యాషన్ డిజైజర్ల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సమావేశంలో టూరిజం శాఖ జీఎం ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ రాములు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకే..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సుందరీమణుల పర్యటన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సుందరీమణుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం కొండపైన వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరి క్షేత్రం ఏ విధంగా, ఎలా తీర్చిదిద్దారు, ఎంత మహిమాన్వితం ఉందనే అంశాలను సుందరీమణులకు తెలియజేసి, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు. యాదగిరి క్షేత్ర విశిష్టతను విశ్వవ్యాప్తంగా తెలియజేసేందుకు సుందరీమణుల పర్యటన దోహదపడుతుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ డీఈఓ భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు ఉన్నారు.
కలెక్టర్ హనుమంతరావు

ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు