
వీరన్న ఆశయాలను కొనసాగిస్తాం
తుంగతుర్తి : మారోజు వీరన్న ఆశయాలను కొనసాగిస్తామని సీపీయూఎస్‌ఐ (ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ) కేంద్ర కమిటీ సభ్యుడు పగడాల కోదండ అన్నారు. మారోజు వీరన్న సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత మారోజు వీరన్న వర్ధంతితో పాటు దళిత బహుజన జనత ప్రజాస్వామ్య విప్లవం కోసం నేలకొరిగిన 145 మంది అమరవీరులను స్మరిస్తూ ఈనెల 16 నుంచి మే 31 వరకు అమరవీరుల సంతాప సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్ కాసీం మాట్లాడుతూ.. ఉమ్మడి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలను రద్దుచేసి ఏ కులానికి ఆ కులం ప్రతిపాదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీయూఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న, మారోజు వీరన్న, సహచరి చైతన్య, వీరన్న కుమార్తె దిశ, లలిత, మట్టపల్లి యాదయ్య, గుడిపల్లి రవి, శరత్, మౌర్య, బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.