సీఎం సమీప బంధువు మృతి
మునుగోడు : సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు వరుసకు మామ అయిన వెదిర మధుసూదన్‌రెడ్డి(95) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి భార్య పూలమ్మ చెల్లెలు సూదిని పారిజాత, సీఎం సతీమణి తల్లి అక్కాచెల్లెలు. కాగా.. మధుసూదన్‌రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర నాయకులు మధుసూదన్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. శనివారం జరగనున్న అంత్యక్రియలకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిసింది.
చెరువుగట్టులో కొబ్బరికాయల షాపు సీజ్
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొబ్బరి కాయల షాప్‌కు టెండర్‌కు సంబంధించి రూ.19లక్షలు పెండింగ్ ఉండటంతో శుక్రవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. రామలింగేశ్వరస్వామి ఆలయ గుట్టపైన కొబ్బరి కాయల విక్రయం కోసం గత సంవత్సరం ఆగస్టు 1న టెండర్ ఏర్పాటు చేశారు. ఈమేరకు టెండర్‌దారుడు రూ.72లక్షలకు వేలం ద్వారా దక్కించుకున్నాడు. అతను ఇప్పటికీ రూ.19లక్షల వరకు బకాయి ఉండటంతో కొబ్బరికాయల షాపును సీజ్ చేసినట్లు ఈఓ నవీన్‌కుమార్, సూపరింటెండెంట్ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.


