నీటిని వృథా చేయొద్దు.. ఆదా చేద్దాం
సంస్థాన్ నారాయణపురం : నీటిని వృథా చేయొద్దని.. ఆదా చేసి పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేతలు డాక్టర్ సుజాత, డాక్టర్ వాణిశ్రీ సూచించారు. గురువారం సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలో నిర్వహించిన రైతు ముగింట శాస్త్రవేతలు కార్యక్రమంలో వారు పాల్గొని నీటి ఆదా, సాగు విధానాలపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రసాయనిక ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలన్నారు. పంటల మార్పిడి విధానం అవలంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వర్షితరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, వైస్ చైర్మన్ చెన్నోజు బ్రహ్మచారి, యాదవరెడ్డి, ఏఈఓలు నవ్య, శశిబిందు, అనురాధ, సైదులు తదితరులు పాల్గొన్నారు.


