
భూ భారతి దరఖాస్తులు 128
ఆత్మకూరు(ఎం): భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల సత్వర పరిష్కారానికి ఆత్మకూర్(ఎం) మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 128 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా సర్వే నంబర్ల సమస్యకు సంబంధించి 11 ఫిర్యాదులు ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఆత్మకూర్(ఎం) మండలాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తహసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
1,828 దరఖాస్తు ఫారాలు పంపిణీ
మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,828 మంది రైతులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. పలు రకాల భూసమస్యలపై 128 దరఖాస్తులు అందాయి.
రెవెన్యూ గ్రామాల వారీగా
దరఖాస్తులు
రాయిపల్లిలో 15, సర్వేపల్లి 5, రహీంఖాన్‌పేట 31, రాఘవాపురం 4, సింగారం 3, పల్లెర్ల 16, కాల్వపల్లి 1, లింగరాజుపల్లి 6, కప్రాయపల్లి 2, కూరెళ్ల 7, పారుపల్లి 2, తుక్కాపురం 7, పల్లెపహాడ్ 2, మొరిపిరాల 10, ధర్మారం 2, కొరటికల్ 7, ఆత్మకూర్(ఎం) 8 దరఖాస్తులు వచ్చాయి.
1లోగా పరిష్కారం
రైతులకు సహకారం అందించేందుకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది రైతుల దరఖాస్తు ఫారాలు నింపి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా సమస్య పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు. జూన్ 2వ తేదీన దరఖాస్తుదారులకు పరిష్కార పత్రాలు ఇవ్వనున్నారు.
ఫ ఆత్మకూరు(ఎం) మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు
ఫ అత్యధికంగా సర్వే నంబర్ల మిస్సింగ్‌పై ఫిర్యాదులు
ఫ జూన్ 2వ తేదీన పరిష్కార పత్రాలు
ఆధారాలతో దరఖాస్తు చేశాం
మా తాత ఉప్పల రామయ్యకు చెందిన 17 గుంటల భూమిని 2019–20లో అధికారులు ఇతరులకు అక్రమ పౌతి చేశారు. దీనిపై పూర్తి ఆధారాలతో రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేశాం. అధికారులు పరిశీలించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్య చెప్పుకునే అవకాశం వచ్చింది. –మత్స్యగిరి కూరెళ్ల,
ఆత్మకూరు(ఎం) మండలం
జూన్ 2న పరిష్కార పత్రాలిస్తాం
మండలంలోని 17 రెవె న్యూ గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు సజావుగా పూర్తి చేశాం. రైతులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించాం. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం జూన్2వ తేదీన పరిష్కార పత్రాలు అందజేస్తాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఉన్నతాధికారులకు, సదస్సులు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
–లావణ్య. తహసీల్దార్, ఆత్మకూరు(ఎం)
మిస్సింగ్ సర్వే నంబర్లు 11
పెండింగ్ మ్యుటేషన్ 04
డిజిటల్ సంతకం పెండింగ్ 08
విస్తీర్ణంలో తేడాలు 25
పేర్లలో తప్పుల సవరణ 08
లావణి పట్టా 07
అసైన్డ్ ల్యాండ్ 02
పౌతి 22
ఇతర సమస్యలు 41

భూ భారతి దరఖాస్తులు 128

భూ భారతి దరఖాస్తులు 128