
బేస్‌బాల్ జాతీయ జట్టుకు పలివెల వాసి ఎంపిక
మిర్యాలగూడ: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ బేస్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికై నట్లు మిర్యాలగూడకు చెందిన బేస్‌బాల్ కోచ్, బేస్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ చిర్ర మల్లేష్‌యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్‌కు బేస్‌బాల్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి తాను నల్లగొండ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్లు మల్లేష్‌యాదవ్ తెలిపారు. ఇరాన్ దేశంలో రేపటి నుంచి 21వ తేదీ వరకు జరిగే బేస్‌బాల్ వెస్ట్ ఏషియా కప్ ఇరాన్–2025 ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున శివకుమార్ ఆడనున్నట్లు పేర్కొన్నారు. శివకుమార్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల అమరావతి సైదులు, పాశం నరసింహారెడ్డి, ఉస్మాన్ షేక్, పరమేష్, శంకర్, మౌనిక, మహేష్, స్వామి, పవన్, రవి తదితరులు అభినందనలు తెలిపారు.
కౌలు రైతుల నిరసన
తుర్కపల్లి: కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని తుర్కపల్లికి చెందిన కౌలు రైతు రాపోలు నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని వానాకాలం సీజన్ నుంచి అమలు చేయీలని కోరారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, బ్యాంకు రుణాలు మంజారు చేయాలన్నారు.

బేస్‌బాల్ జాతీయ జట్టుకు పలివెల వాసి ఎంపిక