
ప్రారంభించకుండానే శిథిలావస్థకు..
గుండాల మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది. బస్సుల కోసం ప్రయాణికులు ఎండ, వానలో నిరీక్షించకుండా ఎంపీ ల్యాండ్ నిధులతో బస్టాండ్ నిర్మించారు. కానీ, ఆర్టీసీ అధికారుల నిరక్ష్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం బస్టాండ్‌కు అమర్చిన షెట్టర్, కిటికీలు తుప్పుపట్టాయి. మరుగుదొడ్ల కిటికీలు, తలుపులు చెదలుపట్టాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సి వస్తుంది. బస్టాండ్‌ను ప్రారంభించి ఉపయోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. –గుండాల