
గత పాలకుల తీరుతో రాష్ట్రానికి అన్యాయం
హుజూర్‌నగర్: కృష్ణానది జలాల పంపకాల విషయంలో గత పాలకుల తీరుతో పదేళ్లు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాలకు 811 టీఎంసీలు కేటాయించగా ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు(66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34శాతం) అని జరిగిన లిఖిత పూర్వక ఒప్పందాన్ని గత పాలకులు అంగీకరించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై బుధవారం చింతలపాలెంలోని అంజలి సిమెంట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా నేను, న్యాయకోవిదుల, నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకొని కృష్ణా జలాల పంపకంలో 70 శాతం తెలంగాణకు తీసుకొచ్చేలా ట్రిబ్యునల్ పునఃసమీక్షించేలా చేశామన్నారు. తమ ప్రభుత్వం ట్రిబ్యునల్‌తో పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి కృష్ణా జలాలలో నీరు కేటాయించలేదని, తాము వచ్చాక నీటి కేటాయింపు కోసం పట్టుబట్టి పోరాడుతున్నామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద పెద్ద ఎత్తున నిధులు వృథా చేశారని, లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూడా వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.38,000 కోట్లతో మొదలుపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, అది పూర్తి చేస్తే బాగుండేదన్నారు. దానిని రద్దు చేసి కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి అప్పలు తెచ్చి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే విధంగా సీఎంతో కలిసి సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
కృష్ణా జలాల్లో వాటా పెంపునకు
ట్రిబ్యునల్‌తో పోరాడుతున్నాం
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి