
నీటి బాధ తప్పింది
రెండేళ్ల కిందటి వరకు మా గ్రామంలో నీటి సమస్య బాగా ఉండేది. మూసీ నదిలో బావి తవ్వుకొని ఓడలు (రింగ్‌లు) ఏర్పాటు చేసుకునే వాళ్లం. ఒక్కోసారి నీరు అందక మోటార్లు కాలిపోయేవి. చెక్‌డ్యామ్‌లు నిర్మించాక ఆ సమస్యలు తొలగిపోయాయి. రెండు పంటలకు నీరు అందుతోంది.
– సంకరమద్ధి రమణారెడ్డి, కాసరబాద
రైతులకు మేలు
గ్రామంలో వేసవి కాలంలో బోర్లు, బావులు ఇంకిపోయేవి. పక్కన మూసీ నది ఉన్నా తాగడానికి పనికిరావు. ప్రస్తుతం చెక్ డ్యామ్ వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు సరిపడా లభ్యమవుతోంది. రైతులకు ఎక్కువ మేలు జరుగుతోంది.
– జంపాల శ్రీనివాస్, టేకుమట్ల
రైతులను ప్రోత్సహించాలి
వాటర్‌షెడ్ పథకంలో భాగంగా అన్ని వాగుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించాలి. వృథాను అరికట్టేలా రైతులకు మెళకువలు నేర్పించాలి.
– కొండూరి స్వామి, జనగాం, నారాయణపూర్ మండలం

నీటి బాధ తప్పింది

నీటి బాధ తప్పింది