
భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం
తుర్కపల్లి: గందమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం తుర్కపల్లి మండలం గంధమల్ల రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించడంతో పాటు పరిహారంపై చర్చించారు. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే ప్రతి రైతుకు మెరుగైన పరిహారం అందేలా చూస్తామన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉందని, రైతులు సహకరించాలని కోరా రు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తహసీల్దార్ దేశ్యానాయక్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
జీపీఓ పరీక్షకు 151 మంది అర్హులు
సాక్షి, యాదాద్రి: గ్రామ పాలన అధికారుల (జీపీఓ) ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పూర్వపు వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 321 రెవెన్యూ గ్రామాలు ఉండగా జీపీఓ పోస్టుల కోసం 189 మంది ధరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. 151 మందిని పరీక్షకు అర్హులుగా తేల్చారు. ఈనెల 25న జీపీఓ పరీక్ష జరగనుంది. 2022 ఆగస్టులో 212 మంది వీఆర్‌ఓలు, 2023 ఆగస్టులో 510 మంది వీఆర్‌ఏలను ఇతర శాఖలకు బదిలీ చేశారు.
ముగిసిన వృత్యంతర శిక్షణ
భువనగిరి : బోధన మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని బీచ్‌మహాల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం, ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రంలో ఇస్తున్న వృత్యంతర శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి డీఈఓ సత్యనారా యణ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న మెళకువలను విద్యార్థులకు ఉపయోగపడేలా బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోర్సుల ఇంచార్జి ఎం.భాస్కర్, డీఆర్‌పీలు బుచ్చిరెడ్డి, శ్రీధర్, నరేంద్రస్వామి, వెంకన్న, రఘు తదితరులు పాల్గొన్నారు.
గౌస్‌కొండ టీచర్‌కు కీర్తిరత్న పురస్కారం
భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు డాక్టర్ పాండాల మహేశ్వర్ కీర్తి రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌతమేశ్వర సాహితీ కళా సేవాసంస్థ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళా,సేవా రంగాల్లో సేవలందిస్తున్న వారికి కీర్తిరత్న పురస్కారాలతో సత్కరిస్తుంది. అందులో భాగంగానే విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ పాండాల మహేశ్వర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కాగా ఆదివా రం మంథనిలోని జానకిరామ కల్యాణవేదికలో నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు స్వర్ణకంకణం తొడిగి శాలువా కప్పి, మెమొంటో, పురస్కారం అందజేయనున్నారు. పురస్కారం వచ్చినందుకు ఆనందంగా ఉందని మహేశ్వర్ తెలిపారు. పాండాల మహేశ్వర్‌ను మాజీ సర్పంచ్ పక్కీరు లావణ్యదేవేందర్‌రెడ్డి, నేతాజీ యువజన సమాఖ్య అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశం, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, అశోక్, నర్సింహ, చెక్క శ్రీను తదితరులు అభినందించారు.
22న భువనగిరి మీదుగా స్పెషల్ టూరిస్ట్ రైలు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి మీదుగా ఈనెల 22వ తేదీన స్పెషల్ టూరిస్ట్ రైలు వెళ్లనుందని సౌత్‌సెంట్రల్ జోన్ జాయింట్ టూరి జం జనరల్ మేనేజర్ కిషోర్ సత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి టూరిస్ట్ రైలు బయలుదేరి భువనగిరి, జనగామ, కాజీ పేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. టూర్ ప్యాకేజీ రూ.14,250 ఉంటుందన్నారు. రైలులోని ప్రతి కోచ్ సౌకర్యాలు ఉంటాయన్నా రు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. భారత్ స్పెషల్ టూరిస్ట్ రైలు ద్వారా అరుణాచలం, రా మేశ్వరం, మధురై, శ్రీరంగం ప్రాంతాలకు వెళ్లవచ్చన్నారు. వివరాలకు 9701360701, 92810 30712ను సంప్రదించాలని కోరారు.

భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం