
ఈదురుగాలులకు ఒరిగిన ధ్వజ స్తంభం
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలో మంగళవారం భారీ ఈదురుగాలులతో కూడి వర్షం కురవగా.. గ్రామ శివారులోని పురాతన శ్రీలక్ష్మీనృసింహస్వామి, మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం ఒక పక్కకు ఒరిగింది. శివాలయంలోని భారీ చెట్లు నేలకొరిగాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా 1995లో ఇండియా సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్లు కొందూటి సిద్ధయ్య, పొదిల శ్రీనివాస్ తెలిపారు. విశిష్టమైన ఆలయాలు దెబ్బతినడం పట్ల అర్చకులు నాగేంద్రప్రసాద్‌శర్మ, సాంబశివరావుశర్మ, రామానుజాచార్యులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

ఈదురుగాలులకు ఒరిగిన ధ్వజ స్తంభం