
అర్జీలు వేలల్లో.. మంజూరు వందల్లో!
ఆలేరురూరల్: జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 96,792 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 405 మందికి మాత్రమే మంజూరయ్యాయి. దీంతో ప్రతి రోజూ దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజాపాలన గ్రామసభల్లో తెల్ల రేషన్‌కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభల్లో 96,792, మీసేవ కేంద్రాల ద్వారా 1,029 దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల నమోదుకు 21,770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 20,133 దరఖాస్తులను ఓకే చేశారు. 1,637 పెండింగ్‌లో ఉన్నాయి.
నిరాశలో వేలాది మంది..
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెసప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రజాపాలన గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తొలి విడతలో 405 కార్డులకే మంజూరు ఇచ్చారు. సుమారు లక్ష వరకు దరఖాస్తులు రాగా కొద్ది మందికే కార్డులు మంజూరు చేయడంతో మిగతా వారు అయోమయంలో ఉన్నారు. తమకు కార్డులు వచ్చేసరికి ఎన్నేళ్లు పడుతుందోనని మదనపడుతున్నారు. కొత్త కార్డులు మంజూరుకాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలకోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కార్డుదారులకు సన్నబియ్యం
ఏప్రిల్ కోటా ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు, 6,76,188 యూనిట్‌లు ఉన్నాయి. వీరికి 4,307 టన్నుల బియ్యం అవసరం. వీరితో పాటు కొత్తగా మంజూరైన 405 (20,133 యూనిట్‌లు) కార్డులకు ఈ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు.
అర్హులందరికీ అందని రేషన్ కార్డులు
ఫ కొత్తగా 405 మందికే మంజూరు
ఫ ఎదురుచూపుల్లో మిగతావారు
అర్హులందరికీ కార్డులు
రేషన్ కార్డు మంజూరుకాని దరఖాస్తుదారులు ఆందోళన చెందవద్దు. విడతల వారీగా అర్హులందరికీ వస్తాయి. నూతన కార్డుదారులకు మేనెల సన్నబియ్యం పంపిణీ చేశాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కొందరు అమ్ముకునేవాళ్లు. ప్రస్తుతం సన్నబియ్యాన్ని అందరూ ఇష్టంగా తీసుకెళ్తున్నారు.
–అంజిరెడ్డి, తహసీల్దార్, ఆలేరు

అర్జీలు వేలల్లో.. మంజూరు వందల్లో!