
తెలంగాణ జరూర్ ఆనా..
సాక్షి, యాదాద్రి : ప్రపంచ సిల్క్ సిటీగా, సాంస్కతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్‌పోచంపల్లి, ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందాయి. ప్రధానంగా పోచంపల్లి చీరల తయారీ,డిజైన్,అద్దకం ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు.అంతేకాక రుంజా
వాయిద్యం,సంస్కృతి,సాంప్రదాయ నాదస్వర ,కోలాటాల స్వాగతంతో మైమరచిపోయారు. టూరిజం పార్క్ లోకి ఆహ్వానిస్తూ పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం్ఙ అంటూ అందగత్తెలకు ఆత్మీయ స్వాగతం పలికారు. పోచంపల్లి చేనేత టూరిజం పార్క్ ప్రవేశ దారం వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ ‘తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ నినదించారు. ఇక్కత్ చీరలు, వస్త్రాల తయారీని చూసి వీరు అబ్బురపడ్డారు.ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులోపరిశీలించిన అతిథులు, రాట్నంతో దారం చుట్టడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
స్టెప్పులేసిన సుందరీమణులు
రుంజా కిన్నెర,వాయిద్యాల మధుర సంగీతం అందగత్తెలను మంత్రముగ్ధుల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్ లు స్వయంగా రుంజా వాయించగా, మరికొందరు సంగీథానికి లయబద్దంగా నాట్యం చేశారు. అరి చేతులపై నెమలి సోయగం, నాజూకై న నక్షత్రాలు, పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన బ్యూటీలు ఫొటో సెషన్లకు పోజ్ ఇచ్చారు.
నినదించిన ప్రపంచ అందగత్తెలు
సుందరాంగుల మనసుదోచుకున్న భూదాన్‌పోచంపల్లి
ఆకట్టుకున్న ఇక్కత్ చీరల ప్రక్రియ, డిజైన్‌లు
అపూర్వ స్వాగతానికి అబ్బురపడిన
అందగత్తెలు