
జై జవాన్.. జై భారత్
భువనగిరి : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా శుక్రవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా వెన్నుదన్నుగా నిలవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీసీసీ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ, ప్రదీప్, కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.