
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
ఆత్మకూరు(ఎం): మండలంలోని లింగరాజుపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. లింగరాజుపల్లిలో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదు అందడంతో పాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఆయన కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం, తూకం వేయని ధాన్యం వివరాలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రైతులతో మాట్లాడి రాస్తారోకో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లావణ్య, ఆర్‌ఐ మల్లికార్జునరావు ఉన్నారు.
2.37లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి,యాదాద్రి : జిల్లాలో ఇప్పటి వరకు 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామని, పక్షం రోజుల్లో మరో లక్ష టన్నులు సేకరిస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.452 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ధాన్యం ఎక్కువ ఉన్న కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు