ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి
రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడికి పాల్పడ్డారు జనసేన పార్టీ కార్యకర్తలు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు టోల్గేట్ సమీపంలో ఆమెపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపీ అనే వ్యక్తిని చితకబాదారు. ఆపై హర్షవీణను మూకుమ్మడిగా ఎటాక్ చేశాయి ఆ మూకలు. తనపై దాడి జరిగిన విషయన్ని రైల్వేకోడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ.కాగా, నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు.తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు.మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?, మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్‌ను నిలదీశారు.
ఫిన్ అలెన్ ఊచకోత
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ చెలరేగిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్ పేన్ వేసిన తొలి ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు పిండుకొని, ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. జైస్వాల్ 2023 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఫిన్ అలెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షాతో కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. షా 2021 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్లో 24 పరుగులు రాబట్టాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు26 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, 202324 - పృథ్వీ షా (DC) vs KKR, 202124 - ఫిన్ అలెన్ (KKR) vs SRH, 2026*22 - యశస్వి జైస్వాల్ (RR) vs PBKS, 202521 - నమన్ ఓజా (RR) vs KKR, 200921 - సునీల్ నరైన్ (KKR) vs RR, 2018మ్యాచ్ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కేకేఆర్ ధాటిగా ప్రారంభించింది. అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అలజడి సృష్టించి ఔటయ్యాడు. అనంతరం అంగ్క్రిష్ రఘువంశీ బ్యాట్ ఝులిపించడం ప్రారంభించాడు. అయితే ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కేకేఆర్‌కు కోలుకోని లేని దెబ్బ తగిలింది. దురదృష్టవశాత్తు గ్రీన్ రనౌటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 79-3గా ఉంది. రఘువంశీ (35), రింకూ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. హర్ష్ దూబే, ఉనద్కత్‌కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
మన దేశంలోని గ్రామీణ, అటవీ ప్రాంత బాలలు ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వాళ్లంతా రకరకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. నేలపై గీతలు గీయడం, కొన్ని ఆకారాలతో ఆట స్థలాలను సృష్టించడం, ఎండిన పండ్ల గింజలను పాచికలుగా – పావులుగా వాడటం వంటివి చేస్తుంటారు. ఎండిన ఆకులు, చింకిపాత లతో బంతులు చేస్తారు. వెదురు బొంగులతో హాకీ, ఫుట్‌బాల్ గోల్‌పోస్టులను తయారు చేస్తారు. చాలామంది బూట్లు లేదా జెర్సీలతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు. చెరువులు, సరస్సులలో ఈదులాడుతూ ఆనందిస్తారు. ఒడిషాలోని జాజ్‌పూర్ వాస్తవ్యురా లైన 15 ఏళ్ల అంజలి ముండా ఇదే తరహాలో తనకు అందుబాటులో గల వనరులు, శిక్షణతో ఈతలో తన ప్రతిభకు సానబెట్టుకుని, ‘ఖేలో ఇండియా తొలి గిరిజన క్రీడలు–2026’లో తొలిరోజునే 3 స్వర్ణ పత కాలను కైవసం చేసుకుని యువతలో ఎనలేని స్ఫూర్తి నింపింది.ఏకలవ్యుడి వారసత్వంగిరిజనులకు విలువిద్యపై సహజంగా మక్కువ. సంథాల్ సమాజం తమపై దోపిడీని ఎదిరిస్తూ 1855లో బ్రిటిష్ పాలకులపై సాగించిన భీకర పోరాటం ‘సంథాల్ హూల్’ (తిరుగుబాటు)గా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. బ్రిటిష్ దళాలు ఆధునిక ఆయుధాలతో ఆ తిరుగుబాటును అణచివేసినప్పటికీ, సంథాల్ యోధుల యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. నేను జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అక్కడి ‘ఊరి –మారి’ గ్రామంలోగల ‘సంథాల్ హూల్’ వీరులు, అమర సోదరు లైన సిధో–కన్హు, చండ్–భైరవ్ సహా శౌర్యశీలురైన సోదరీమణులు ఫూలో–ఝానోల విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కింది. అసమాన విలుకాడిగా పూజలందుకునే ఏకలవ్యుని ఖ్యాతిఎంతటిదో భారతదేశంలోని ఏ బిడ్డను అడిగినా గొప్పగా వర్ణిస్తాడు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గిరిజనులకు ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత మాత్రమేగాక విలువిద్యలో ఆదర్శప్రాయుడు. ఆయన వార సత్వానికి అనుగుణంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లోని ‘క్రీడా నైపుణ్య కేంద్రాలు’ బాలలకు ఆధునిక క్రీడా సౌకర్యాలు, విధా నాలను చేరువ చేస్తున్నాయి. నా వంతు కృషి ఫలితంగా మా స్వగ్రామంలోనూ నిరుపేద బాలల కోసం ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటైంది. మరికొంత ప్రయ త్నంతో ఆ పాఠశాల ప్రాంగణంలో విలువిద్యా శిక్షణకూ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు చిన్నచిన్న వ్యక్తిగత, సమష్టి ప్రయత్నాల ద్వారా గిరిజన బాలల్లో సహజ క్రీడా ప్రతిభ ఇనుమ డిస్తుందనడంలో సందేహం లేదు.క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధమా గ్రామంలోని ఇతర గిరిజన బాలల తరహాలోనే నేను కూడా చిన్నతనంలో ఈత కొట్టడం సహా ఇతర కసరత్తులు, క్రీడలపై ఆసక్తి చూపేదాన్ని. మా పాఠశాల క్రీడా పోటీలలో తరచూ ప్రథమ స్థానంలో నిలవడం నాకు పరిపాటి. అలాంటి ఓ పోటీ సందర్భంగా నా నేస్తానికి ప్రథమ బహుమతి ఆనందానుభూతినిచ్చే ఉద్దేశంతో నేను కావాలనే వెనుకబడటం ఓ మధుర జ్ఞాపకం. క్రీడలు బాలల్లో జట్టు స్ఫూర్తిని పెంచి, బలమైన సామాజిక స్నేహానుబంధాలకు తోడ్పడతాయి. మైదానంలో తీవ్రంగా పోటీపడే క్రీడాకారుల నడుమ సాధారణంగా స్నేహబంధం పటిష్ఠంగా ఉంటుందన్నది వాస్తవం.మా సోదరుడు ఫుట్‌బాల్ చక్కగా ఆడేవాడు కానీ తీవ్ర గాయంతో ఆటలో కొనసాగలేకపోయాడు. మా కుటుంబ సభ్యు లందరూ వివిధ క్రీడలలో రాణించినవారే. గిరిజన కుటుంబాలకు ఉజ్వల క్రీడా సంప్రదాయం సహజాతమని చెప్పడానికే నా వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాను. వారి జీవితాల్లో క్రీడలు ఒక వినోదంగా, సామాజిక కార్యకలాపాల సాధనంగా మాత్రమే మిగిలి పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని క్రీడా సంస్థల సహకారంతో శ్రీకారం చుట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం నలు దిశలా నిబిడీకృతమైన ప్రతిభను విశేషంగా వెలుగులోకి తెస్తోంది.మన దేశంలో కొన్నేళ్ల కిందటి దాకా కేవలం పెద్ద నగరాల్లోనే ఉత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో క్రీడల అకాడమీలు, శిక్షణ సౌకర్యాలు లభ్యమయ్యేవి కావు. కానీ, ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలలకు క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం నుంచి ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ వంటి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.ఖేలో ఇండియా!నా విద్యార్థి దశలో– అయిదారు గ్రామాల క్రీడా ఔత్సాహికులు ఏకమై, గ్రామీణులను సమీకరించి పోటీలు నిర్వహించడం నాకింకా గుర్తుంది. అలాగే, కొన్ని ఆధ్యాత్మిక–సాంస్కృతిక సంస్థలు కూడా గిరిజన ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, అలాంటి పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు గ్రామీణ స్థాయిని దాటి ఎదగలేకపోయేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా కొన్నేళ్ల నుంచీ ప్రశంసనీయ కృషి సాగుతోంది. ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ అలాంటి చర్యలకు మరింత ఉత్తేజమిచ్చాయి. భారత్ తన క్రీడాకారుల సహజ ప్రతిభ వల్లనే 1928 ఒలింపిక్ క్రీడల్లో తొలి హాకీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి ఘన విజయంలో కీలక పాత్రధారులు గిరిజన క్రీడాకారులే. అప్పటి నుంచీ దిలీప్ టిర్కీ, సుబోధ్ లక్రా, సలీమా టెటే వంటి క్రీడాకారులు భారత కీర్తికిరీటంలో మణిమాణిక్యాలై హాకీ క్రీడకే వన్నెతెచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం ‘ఖేలో ఇండియా’ కింద స్థానికం నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని భౌగోళిక ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సంస్థలకు తగిన క్రీడావరణం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ‘అస్మిత’ పథకం అమలవుతోంది. దీనిద్వారా మన గిరి పుత్రికల సామర్థ్యం ఇనుమడించడమే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ ఇచ్చిన ఉత్తేజాన్ని నిరంతరం బలోపేతం చేయాలి. తదనుగుణంగా గిరిజన క్రీడాకారులను స్థిరంగా ప్రోత్సహిస్తే మన దేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలబెట్టగల క్రీడాకారుల సమూహం రూపొందుతుంది.‘బస్తర్, సుర్గుజా ఒలింపిక్స్’లో ఏడు లక్షల మందికిపైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సలిజాన్ని వీడి, క్రీడలనే సానుకూల మార్గంగా ఎంచుకున్న యువతరం కూడా వారిలో ఉన్నారు. గిరిజన వర్గాలు సహా మన యువతరం క్రీడాప్రతిభ, దేశానికి అమూల్య సామాజిక మూలధనం. ఈ వెలలేని వనరును సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాతీయ క్రీడా రంగం ఎన్నో అద్భుత ప్రమాణాలను నెల కొల్పగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ‘ఖేలో ఇండియా! ఖూబ్ ఖేలోఇండియా!’ అంటూ నా వంతుగా నినదిస్తున్నాను.ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి(మార్చి 25న ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలి ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ నేటితో ముగియనున్నాయి.)
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
తెలంగాణే 'గ్యారంటీ'!
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
అతనే.. భామ
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
హనుమాన్ జయంతి సందర్భంగా...
వెండితెరపైకి వీరుల పోరాటం
కేకేఆర్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మీరు మాత్రం మా భుజాలపై మోయించని పార్టీనే లేదనుకుంటా సార్!!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ?
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
సాక్షి కార్టూన్ 01-04-2026
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
తెలంగాణే 'గ్యారంటీ'!
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
అతనే.. భామ
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
హనుమాన్ జయంతి సందర్భంగా...
వెండితెరపైకి వీరుల పోరాటం
కేకేఆర్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మీరు మాత్రం మా భుజాలపై మోయించని పార్టీనే లేదనుకుంటా సార్!!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ?
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
సాక్షి కార్టూన్ 01-04-2026
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఫొటోలు
హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)
రూటు మార్చిన శృతి హాసన్.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)
సినీ కెరీర్.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్ (ఫోటోలు)
తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)
దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
వామ్మో ఎండలు.. (ఫొటోలు)
డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)
దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్..! (ఫొటోలు)
సినిమా
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్‌స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగు సినిమాల రికార్డ్స్ కష్టమే..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది. ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.
ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!
తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్‌ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది.
క్రీడలు
కేకేఆర్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్
కేకేఆర్‌పై ఎస్ఆర్హెచ్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.ఎస్ఆర్హెచ్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను మట్టుబెట్టారు. ఉనద్కత్ 3, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి తలో 2, హర్ష దూబే ఓ వికెట్ పడగొట్టారు. గ్రీన్, రఘువంశీ రనౌటయ్యారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (52) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (35), ఫిన్ అలెన్ (28), రమన్‌దీప్ సింగ్ (10), సునీల్ నరైన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో రహానే 8, గ్రీన్ 2, కార్తీక్ త్యాగి 5, అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.రాణించిన క్లాసెన్, హెడ్, అభిషేక్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ 14, అనికేత్ వర్మ 1, శివాంగ్ కుమార్ 4, హర్ష్ దూబే 9 (నాటౌట్) పరుగులు చేశారు. సలీల్ అరోరా డకౌటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
రసెల్ రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్
కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆండ్రీ రసెల్ పేరిట ఉండిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఎస్ఆర్హెచ్తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ రెండు క్యాచ్‌లు పట్టాడు. తొలుత ముజరబానీ బౌలింగ్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ను, ఆతర్వాత అనుకూల్ రాయ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ క్యాచ్ పట్టాడు.ఈ రెండు క్యాచ్‌ల తర్వాత కేకేఆర్ తరఫున రింకూ క్యాచ్‌ల సంఖ్య 41కి చేరింది. ఈ క్యాచ్‌లను అతను కేవలం 61 మ్యాచ్‌ల్లోనే పట్టాడు. 40 క్యాచ్‌లు పట్టేందుకు రసెల్‌కు ఏకంగా 133 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఈ విభాగంలో రింక, రసెల్ తర్వాతి స్థానంలో సునీల్ నరైన్ ఉన్నాడు. నరైన్ 191 మ్యాచ్‌ల్లో 36 క్యాచ్‌లు పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన కేకేఆర్, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఢీలా పడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఓవర్లోనే ఏకంగా 24 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభాన్ని అందించాడు. అలెన్ ఔటయ్యాక అదే జోరును అంగ్కృష్ రఘువంశీ (52) కూడా కొనసాగించినప్పటికీ.. దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అంతకుముందు గ్రీన్ (2) కూడా రనౌటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 137-5గా ఉంది. రింకూ సింగ్ (34) కేకేఆర్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా రమన్‌దీప్ సింగ్ (8) క్రీజ్‌లో ఉన్నాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
ఫిన్ అలెన్ ఊచకోత
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ చెలరేగిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్ పేన్ వేసిన తొలి ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు పిండుకొని, ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. జైస్వాల్ 2023 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఫిన్ అలెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షాతో కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. షా 2021 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్లో 24 పరుగులు రాబట్టాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు26 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, 202324 - పృథ్వీ షా (DC) vs KKR, 202124 - ఫిన్ అలెన్ (KKR) vs SRH, 2026*22 - యశస్వి జైస్వాల్ (RR) vs PBKS, 202521 - నమన్ ఓజా (RR) vs KKR, 200921 - సునీల్ నరైన్ (KKR) vs RR, 2018మ్యాచ్ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కేకేఆర్ ధాటిగా ప్రారంభించింది. అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అలజడి సృష్టించి ఔటయ్యాడు. అనంతరం అంగ్క్రిష్ రఘువంశీ బ్యాట్ ఝులిపించడం ప్రారంభించాడు. అయితే ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కేకేఆర్‌కు కోలుకోని లేని దెబ్బ తగిలింది. దురదృష్టవశాత్తు గ్రీన్ రనౌటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 79-3గా ఉంది. రఘువంశీ (35), రింకూ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. హర్ష్ దూబే, ఉనద్కత్‌కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
అభిషేక్ శర్మ ఖాతాలో భారీ రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతాలో మరో భారీ సిక్సర్ల రికార్డు చేరింది. ఇప్పటికే ఎన్నో సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్న అభిషేక్.. తాజాగా సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకొని, మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. వార్నర్ ఎస్ఆర్హెచ్ తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్, అభిషేక్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (89), కేన్ విలియమ్సన్ (64), ట్రవిస్ హెడ్ (50) ఉన్నారు.కాగా, ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) సన్‌రైజర్స్-కేకేఆర్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లోనే అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ తొలి బంతి నుంచి ప్రత్యర్దిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (14) అదే జోరును కొనసాగించే క్రమంలో ఔటయ్యాడు. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 184-4గా ఉంది. ముజరబానీ 2, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ ‘రియల్’ దందా.. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం
ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
మనమంతా ‘టీమ్ ఇండియా’గా కలిసి పనిచేద్దాం... ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్‌పై పట్టు బిగించిన ఇరాన్
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో లోపం... ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఒక వెయ్యి 472 కోట్ల రూపాయలకుపైగా భారం
ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం. చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్. అదేం లేదన్న ఇరాన్
బిజినెస్
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్‌లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్‌తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్‌పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్‌పోర్ట్‌లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్‌లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్‌ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్‌పోర్ట్‌తో టోక్యో డిస్నీల్యాండ్‌కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture)
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఆ కార్ల శకం ముగిసింది.. మస్క్ ట్వీట్!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ కార్ల కోసం ఇకపై ఆర్డర్స్ తీసుకోబోమని, ఇక్కడ డెలివరీ చేయాల్సిన 600 కార్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''టెస్లా మోడల్ S, X మోడల్స్ ఆర్డర్లు ముగిశాయి. స్టాక్‌లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక శకం ముగింపును సూచించడానికి మేము ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఆ కార్లంటే చాలా ఇష్టం. 14 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభోత్సవంలో నేను ఇలా ఉన్నాను'' అని మస్క్ ట్వీట్ చేసారు.జనవరిలో జరిగిన టెస్లా 2025 క్యూ4 ఆదాయాల సమావేశంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తి నిలిపివేత వార్త వెలువడింది. ఆ సమయంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు ఇది ఒక "గౌరవప్రదమైన ముగింపు" అని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇదే సమయంలో.. అవకాశం ఉన్నప్పుడే కార్లను ఆర్డర్ చేయమని మస్క్ వినియోగదారులను కోరారు. కార్ల కోసం కేటాయించిన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆప్టిమస్ రోబోట్ల ఉత్పత్తి కోసం మార్చనున్నట్లు కూడా ఆ బ్రాండ్ వెల్లడించింది.Custom orders of the Tesla Model S & X have come to an end. All that’s left are some in inventory.We will have an official ceremony to mark the ending of an era. I love those cars. This was me at production launch 14 years ago: pic.twitter.com/6kvCf9HTHc— Elon Musk (@elonmusk) April 1, 202614 సంవత్సరాల మార్కెట్మోడల్ S అనేది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెస్లా రూపొందించిన మొదటి వాహనం, దీనిని జూన్ 2012లో విడుదల చేశారు. ఇది 2015, 2016 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.కేవలం 2015లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మోడల్ Xను 2015లో పరిచయం చేశారు. ఈ రెండు మోడళ్లు కలిసి, వాటి ఉత్పత్తి కాలమంతటా 610,000కు పైగా డెలివరీలను సాధించాయి.
ఆఫీస్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ తమ్ముడు
సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్‌లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్‌లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.
ఫ్యామిలీ
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్‌లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్‌తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్‌లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో క్లినికల్ నర్స్‌గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్‌గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు.
అయిననూ... పొయ్యి వెలిగించవలే!
యుద్ధం ఆగడం లేదు. మన ఇంటి గ్యాస్ కష్టాలు, ఆందోళనలు ఆగడం లేదు. ఈ సంక్షోభ కాలంలో సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజా విషయానికి వస్తే... పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్ (డీఎంయీ) ని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే సాంకేతికతను బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీఎంయీని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది దేశం ఎల్పీజీ దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు మన దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఉపకరిస్తుంది. అంతేకాదు, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్ప్రేరకాన్ని (కెటలిస్ట్) ఉపయోగించి మిథనాల్‌ను డైమిథైల్ ఈథర్‌గా మారుస్తుంది. పరిశోధన బృందానికి తిరుమలైస్వామి రాజా నాయకత్వం వహించారు.స్వచ్ఛమైన ఇంధనంసంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే... డైమిథైల్ ఈథర్(డిఎంఈ) చాలా తక్కువ పరిమాణంలో మసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కణ పదార్థాలను విడుదల చేస్తుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. దీంతో పాటు ఇది ఎల్పీజీకి సమానమైన వేడిమిని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వినియోగానికి సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్’ ఇప్పటికే నియమాలను నిర్దేశించింది.గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీలో 20 శాతం వరకు డిఎంఈని కలపవచ్చు. ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎల్పీజీలో 8 శాతం వరకు డిఎంఈ కలపవచ్చు. వంటగది ఏర్పాట్లు మార్చకుండానే ఈ మిశ్రమ ఇంథనాన్ని ఉపయోగించవచ్చు.ఈ ఇంధనంతో ఎంతో ఆదా!మన దేశం 2024లో దాదాపు 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. కేవలం 8 శాతాన్ని డిఎంఈతో భర్తీ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ’9,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వంట ఇంధనం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఏరోసోల్ ఉత్పత్తులలో ప్రోపెల్లెంట్గా పనిచేస్తోంది డిఎంఈ. తమ సాంకేతికతను రోజువారీ వినియోగానికి మరింత చేరువ చేయడానికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక బర్నర్ నమూనాని కూడా రూపొందించారు.ఈ బర్నర్ 100 శాతం ఎల్పీజీ నుండి 100 శాతం డిఎంఈ వరకు, అలాగే ఈ రెండింటి మధ్య ఏ మిశ్రమంతోనైనా ఫ్లెక్సిబుల్ మోడ్‌లో పనిచేయగలదు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఎల్పీజీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనల ద్వారా రోజుకు 2.5 టన్నుల డిఎంఈ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఒక ప్లాంట్‌ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల్లో దీని ఏర్పాటుకు శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.బలమైన ముందడుగుపర్యావరణ సంరక్షణ, ఇంధన భద్రత మధ్య అంతరాన్ని పూరిస్తూ, స్వావలంబన, స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాల దిశగా వేసిన బలమైన ముందడుగుగా ఈ ఆవిష్కరణ నిలవనుంది.‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ నిధులతో కొన్ని సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కార్బన్డయాక్సైడ్ అనేది గ్రీన్హౌస్ వాయువు. దీనిని నియంత్రించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి... కార్బన్ కాప్చర్ అండ్ స్టోరేజ్. మేము మరో అడుగు ముందుకు వేసాం. దీనిద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తూనే శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు’ అంటున్నారు ప్రోఫెసర్ సౌనక్ రాయ్.సీవో2 టు గ్యాస్!కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను స్వచ్ఛంగా మండే వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతను హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రోఫెసర్ సౌనక్ రాయ్, ప్రోఫెసర్ సత్యపాల్ సింగ్, ప్రోఫెసర్ బి.ఎం.రెడ్డి ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.‘మేము ఇప్పటివరకు చేసింది ఒక ప్రయోగశాల–స్థాయి ప్రదర్శన మాత్రమే. తగిన సహాయ సహకారాలతో మేము దీనిని పైలట్ స్థాయికి తీసుకువెళ్లి ఆపై వాణిజ్యీకరణ వైపు వెళ్లగలం. ఇందుకు కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం. మా రీసెర్చ్ గురించి ఒక సైంటిఫిక్ జర్నల్‌కు తెలియజేశాం’ అని ప్రోఫెసర్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు.
రాధిక మర్చంట్ లైలాక్ వాచ్..! ప్రపంచంలోనే..
మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్‌తో తన లుక్‌ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకతలు..వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్‌తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్‌ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్‌ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)
సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!
యంగ్‌గా ఉన్నప్పుడు నేర్చుకోవడం వేరు..పెద్ద వయసు వచ్చాక కొత్తవి నేర్చుకోవాలన్న లోలోన ఏదో బెరుకు ఉంటుంది. కొందరు మాత్రం చాల డేర్‌గా నచ్చిన నైపుణ్యాలను అందుపుచ్చుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ విద్యాకౌర్.మాజీ ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ అయిన విద్యాకౌర్కి డ్రైవింగ్ అంటే మహా ఇష్టం. ఎలాగైన నేర్చుకోవాలన్నది ఆమె డ్రీమ్. అయితే 59 ఏళ్ల వయసులో డ్డ్రైవింగ్ నేర్చుకుందామనుకుంటే..చాలా పెద్ద వయసు అని తిరస్కరించారు అధికారులు. అయితే విద్యాకౌర్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగింది. ఆమెనే స్వయంగా కారు కొనుక్కుని పొరుగువారి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నారామె. ప్రస్తుతం ఆమెనే స్వయంగా కారుని రయ్ రయ్‌మని నడిపేస్తోంది. సీనియర్ సిటిజన్ అనే మూసధోరణిని బద్దలు కొడుతూ..స్వేచ్ఛగా సాగిపోతోందామె. ఇక్కడ విద్యాకౌర్ కథ ఎవరో మన పరిమితుల్ని డిసైడ్ చేయడం కాదు..మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు సాగిపోచ్చు అని చాటి చెబుతోంది ఈ సూపర్ బామ్మ స్టోరీ. View this post on Instagram A post shared by Pune Times Mirror (@thepunemirror) (చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)
అంతర్జాతీయం
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్‌పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్‌లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్‌పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్‌ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు.
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు.
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్‌పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్‌లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్‌కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్‌లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్‌పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్‌లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్‌జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది.
జాతీయం
‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!
కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్‌ఈఎంఎస్) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్‌ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.ప్రత్యేకతలు ఇవే..మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్‌ఈఎంఎస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్‌లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్‌ఈఎంఎస్ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.రూపకర్తలు వీరే..జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం
అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
అన్నానగర్: చెన్నై కొడుంగైయూర్ ప్రాంతానికి చెందిన సుధాకర్. ఇతనికి భార్య , ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో, తన భర్త నుండి విడిగా నివసిస్తున్న కొడుంగైయూర్ లోని కన్నదాసన్ నగర్‌కు చెందిన రమ్య (38)తో సుధాకర్ కు పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా, వారిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈలోగా, గత సంవత్సరం నవంబర్‌లో, వారిద్దరూ కలిసి కొడుంగైయూర్‌లోని కామరాజ్ సాలైలో ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. ఆర్థిక సమస్య కారణంగా కొన్ని నెలల్లోనే వారు ఆ బైక్ షోరూంను మూసివేశారు. దీని తర్వాత, సుధాకర్, రమ్య మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, సుధాకర్ గత వారం నుండి రమ్యకు దూరంగా ఉండి, మళ్లీ తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సుధాకర్ నిర్ణయంతో ఆగ్రహించిన రమ్య, నల్ల బురఖా ధరించి, మంగళవారం రాత్రి సుమారు 12 గంటలకు సుధాకర్ ఇంటికి వచ్చి, అతని ఇంటి బయట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పై, ఇంటి తలుపుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయింది.దీంతో సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం ఉదయం రమ్యను అరెస్టు చేశారు.
బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు చేశారు.తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్ చేశారు.Sagardighi, West Bengal: On Malda issue, Chief Minister Mamata Banerjee says, "The BJP is playing a game...They have removed 1 crore 20 lakhs voter names, which is why we approached the Supreme Court. The Supreme Court ruled that this cannot happen..." pic.twitter.com/HVyEGIdzjs— IANS (@ians_india) April 2, 2026 ఏం జరిగింది?బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వీధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.Seven judicial officers including THREE female officials were kept at siege for over 17 hours by Trinamool goons inside Kaliachak BDO office in Malda ! These judges have been appointed by the Hon'ble Court for completing the SIR process. But Mamata Banerjee and Trinamool does not… pic.twitter.com/a38LCVcPev— Keya Ghosh (@keyakahe) April 2, 2026ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్‌ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్‌లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్‌తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్‌వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్‌లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్‌లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్‌లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్‌వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్‌లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
క్రైమ్
బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.సాఫ్ట్వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్‌పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్ లేఖలో పేర్కొంది. దీంతో 15 మాత్రల ఖాళీ స్ట్రిప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
ముత్తూట్ ఫైనాన్స్ వద్ద టెన్షన్.. ఖాతాదారుల గుండెల్లో రైళ్లు
అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని ముత్తూట్ ఫైనా న్స్ బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్ చేయడానికి సమ్మతించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్ నిమిత్తం బ్యాంకు మేనేజర్‌కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. ఈ చెక్కుతో గోల్డ్‌లోన్‌కు జమ చేయకుండా మేనేజర్ పసుపులేటి నరేష్ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్ మేనేజర్ నరేష్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.ముత్తూట్, మణప్పురం ఇతర ఫైనాన్స్ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం.
అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
అన్నానగర్: చెన్నై కొడుంగైయూర్ ప్రాంతానికి చెందిన సుధాకర్. ఇతనికి భార్య , ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో, తన భర్త నుండి విడిగా నివసిస్తున్న కొడుంగైయూర్ లోని కన్నదాసన్ నగర్‌కు చెందిన రమ్య (38)తో సుధాకర్ కు పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా, వారిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈలోగా, గత సంవత్సరం నవంబర్‌లో, వారిద్దరూ కలిసి కొడుంగైయూర్‌లోని కామరాజ్ సాలైలో ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. ఆర్థిక సమస్య కారణంగా కొన్ని నెలల్లోనే వారు ఆ బైక్ షోరూంను మూసివేశారు. దీని తర్వాత, సుధాకర్, రమ్య మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, సుధాకర్ గత వారం నుండి రమ్యకు దూరంగా ఉండి, మళ్లీ తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సుధాకర్ నిర్ణయంతో ఆగ్రహించిన రమ్య, నల్ల బురఖా ధరించి, మంగళవారం రాత్రి సుమారు 12 గంటలకు సుధాకర్ ఇంటికి వచ్చి, అతని ఇంటి బయట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పై, ఇంటి తలుపుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయింది.దీంతో సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం ఉదయం రమ్యను అరెస్టు చేశారు.
లంచాలకు తలొంచి..
చైతన్యపురి/ఉస్మానియా యూనివర్సిటీ: నగరంలో బుధవారం రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు ఓయూ ఉద్యోగులు, చైతన్యపురి ఏఎస్ఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. లోక్ అదాలత్‌లో కేసు రాజీ కుదురుస్తానంటూ లంచం తీసుకున్న కోర్టు విధులు నిర్వర్తిస్తున్న చైతన్యపురి ఏఎస్ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే పల్లెపు రాంబాబు అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడు. చైతన్యపురి పోలీసులు కోర్టులో చార్జిషిట్ దాఖలు చేశారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుతానని కోర్టు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ పూసల బాలయ్య నిందితుడు రాంబాబును రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాంబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద రాంబాబు నుంచి బాలయ్య డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఓయూ పాలన భవనం కార్యాలయంలోని బిల్స్ సెక్షన్లో పని చేస్తున్న ఉద్యోగులు అరవింద్, రమేశ్ లు రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్ కోసం ఓ విశ్రాంత ఉద్యోగి దరఖాస్తు చేసుకోగా వీరు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ముందస్తు ప్రణాళికతో బాధితుడి నుంచి ఓయూ ఉద్యోగులు రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
వీడియోలు
పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!
మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో
అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..
అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు
వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు


