రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు | Andhra Pradesh witnesses record liquor sales | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు

Apr 2 2026 6:40 PM | Updated on Apr 2 2026 7:39 PM

Andhra Pradesh witnesses record liquor sales

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, రికార్డు స్థాయిలో మద్యం వినియోగం జరుగుతోంది. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌ల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.

గత ఏడాదిలో బీర్ వినియోగం 70.29 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ. 31,237 కోట్లకు చేరాయి. మొత్తంగా ప్రభుత్వం 414 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. గతంలో 362 లక్షల కేసులు ఉండగా, ఇప్పుడు 414 లక్షలకు పెరిగింది.

బీర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి, మొత్తం 232 లక్షల కేసుల బీర్‌ను ప్రజలు వినియోగించారు.

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement