వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నేతలను అంతం చేశామని అన్నారు. బీ2 బాంబర్స్ ఇరాన్‌లో విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఇరాన్ ఆయుధ కర్మాగారాలను ముక్కలు ముక్కలు చేశామని తెలిపారు. ఇరాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాద ఇరాన్‌పై తాము యుద్ధాన్ని ప్రకటించామని అన్నారు. వెనెజువెలాలో కూడా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు.
‘ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ 45 వేల మంది నిరసకారులను చంపేసింది. అమెరికా భద్రత కోసమే ఎపిక్ ప్యూరీ. ఇరాన్‌లో శవాల దిబ్బలే మిగిలాయి. బీ2 బాంబర్స్ ఇరాన్‌లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను దెబ్బతీశాం’ అని అన్నారు.
ఒబామా చేయలేనిది చేశాను..
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్‌లో చేయలేనిది తాను చేశానని ట్రంప్ అన్నారు. ‘ఇరాన్‌తో ఒబామా ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేది. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్‌కు ఇచ్చారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉంది. ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వను. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా లక్ష్యం.
అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌ను నమ్మలేం. అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రక్షణ కవచం కుప్పకూలింది. ఇరాన్ క్షిపణులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం. ఇరాన్‌ను రాతియుగానికి తీసుకెళ్తాం. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా టార‍్గెట్.
అమెరికా సైనికులు 13 మంది మరణించారు. యుద్ధాలు వద్దన్నాను.. కానీ, అమెరికా భద్రత కోసం చేయకతప్పలేదు. ఆపరేషన్ ఎపిక్‌ప్యూరీ సక్సెస్ అవుతోంది. ఇరాన్‌లో పాలన మార్చడం మా లక్ష్యం కాదు. హార్మూజ్ జలసంధి మాకు అవసరం లేదు. రెండు-మూడు వారాల్లో భీకరదాడులు చేస్తాం. కీలక లక్ష్యాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ మిసైళ్లు అమెరికాను తాకలేవు. నా పాలనలో ఎన్నో విజయాలు సాధించాం. మేము అమెరికాను శక్తిమంతమైన దేశంగా మార్చుతున్నాం’ చెప్పారు.


