కేకేఆర్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్‌ | IPL 2026: SRH beat KKR by 65 runs | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్‌

Apr 2 2026 11:21 PM | Updated on Apr 3 2026 10:27 AM

IPL 2026: SRH beat KKR by 65 runs

కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. కేకేఆర్‌ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను మట్టుబెట్టారు. ఉనద్కత్‌ 3, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో 2, హర్ష​ దూబే ఓ వికెట్‌ పడగొట్టారు. గ్రీన్‌, రఘువంశీ రనౌటయ్యారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (52) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్‌ (35), ఫిన్‌ అలెన్‌ (28), రమన్‌దీప్‌ సింగ్‌ (10), సునీల్‌ నరైన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో రహానే 8, గ్రీన్‌ 2, కార్తీక్‌ త్యాగి 5, అనుకూల్‌ రాయ్‌, వరుణ్‌ చక్రవర్తి డకౌటయ్యారు.

రాణించిన క్లాసెన్‌, హెడ్‌, అభిషేక్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో  ఇషాన్‌ కిషన్‌ 14, అనికేత్‌ వర్మ 1, శివాంగ్‌ కుమార్‌ 4, హర్ష్‌ దూబే 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. సలీల్‌ అరోరా డకౌటయ్యాడు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement