అమెరికాలో గుండెపోటుతో వరంగల్‌ వాసి మృతి | Warangal Man Sudden Heart Attack in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో గుండెపోటుతో వరంగల్‌ వాసి మృతి

Mar 17 2026 10:03 AM | Updated on Mar 17 2026 10:03 AM

Warangal Man Sudden Heart Attack in USA

రామన్నపేట: వరంగల్‌ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్‌(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్‌ 2007 సంవత్సరంలో ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల  వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.  

పరామర్శించిన ప్రముఖులు 
మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్‌రావు, చాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్‌ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement