విజేతలు శ్రీచరణ్‌ తేజ్, చిద్విలాసిని | Sricharan Tej and Chidvilasini win Telangana State Ranking Chess Tournament | Sakshi
Sakshi News home page

విజేతలు శ్రీచరణ్‌ తేజ్, చిద్విలాసిని

Apr 3 2026 3:47 AM | Updated on Apr 3 2026 10:29 AM

Sricharan Tej and Chidvilasini win Telangana State Ranking Chess Tournament

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ అండర్‌–15 బాలుర విభాగంలో కొండ్లాపు శ్రీచరణ్‌ తేజ్, అండర్‌–15 బాలికల విభాగంలో కుమ్మరికుంట్ల చిద్విలాసిని విజేతలుగా నిలిచారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వివిధ వయో విభాగంలో తెలంగాణ జిల్లాల నుంచి 300 మందికిపైగా పోటీపడ్డారు. 

నిర్ణీత ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శ్రీచరణ్‌ తేజ్‌ 4.5 పాయింట్లు సాధించగా... చిది్వలాసిని 3.5 పాయింట్లు స్కోరు చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ జయచంద్ర విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆర్‌.చంద్రమౌళి చీఫ్‌ ఆర్బిటర్‌గా, ఆర్‌.శ్రీరామ్‌ డిప్యూటీ ఆర్బిటర్‌గా వ్యవహరించారు. వివిధ వయో విభాగాల్లో టాప్‌–3లో నిలిచిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి.  

అండర్‌–15 విభాగం: బాలురు: 1. శ్రీచరణ్‌ తేజ్‌ (4.5 పాయింట్లు), 2. బొబ్బిలి సుజయ్‌ (4 పాయింట్లు), 3. జక్కరాజు జై శ్రేయాన్స్‌ (4 పాయింట్లు). బాలికలు: 1. చిది్వలాసిని (3.5 పాయింట్లు), 2. లేఖ్యశ్రీ సాన్వి (3 పాయింట్లు), 3. ఎ.ప్రణతి (2.5 పాయింట్లు). అండర్‌–13 విభాగం: బాలురు: 1. ధ్రువ్‌ శ్రీవాస్తవ (5 పాయింట్లు), 2. ఎస్‌.శశాంక్‌ (5 పాయింట్లు), 3. జి.రుషికేశ్‌ ( 4 పాయింట్లు). 

బాలికలు: 1. కె.లాస్య (4 పాయింట్లు), 2. చేట్ల వేదశ్రుతి (3 పాయింట్లు), 3. గౌలీకర్‌ సుహాసిక (3 పాయింట్లు). అండర్‌–11 విభాగం: బాలురు: 1. కేఎస్‌ విశిష్ట్‌ శ్రీరామ్‌ (5 పాయింట్లు), 2. పి.చార్వీక్‌ సాయి (4.5 పాయింట్లు), 3. కొత్తపల్లి దేవాంశ్‌ (4.5 పాయింట్లు). బాలికల విభాగం: 1. పొలిశెట్టి ధృతి (4 పాయింట్లు), 2. కె.తేజస్వి (4 పాయింట్లు), 3. మునిపల్లి ఆశ్రిత (4 పాయింట్లు). 

అండర్‌–9 విభాగం: బాలురు: 1. అంబటి ప్రసిధ్‌ (5 పాయింట్లు), 2. బి.యజత్‌ రెడ్డి (5 పాయింట్లు), 3. పట్లోళ్ల ధ్రువిన్‌ రెడ్డి (4 పాయింట్లు). బాలికలు: 1. జి.శాన్విత (3 పాయింట్లు), 2. సాన్విక (3 పాయింట్లు), 3. ముద్దాల కుముద (3 పాయింట్లు). అండర్‌–7 విభాగం: బాలురు: 1. రంగనాధ వేద ఆర్క (5 పాయింట్లు), 2. ఎస్‌. తనవ్‌ ఇషాన్‌ (5 పాయింట్లు), 3. గూడురు విహాన్‌ (4 పాయింట్లు). బాలికలు: 1. మెహరీన్‌ షేక్‌ సుహీరా (4 పాయింట్లు), 2. ఆవుల శ్రేయాంశి (3 పాయింట్లు), 3. రంగనాధ ఐరా అర్ణి (3 పాయింట్లు). 

Advertisement
 
Advertisement
Advertisement