దురంధర్‌-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా? | Dhurandhar 2 Movie Collections Effect In Tollywood | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్‌ వర్సెస్‌ కాంతార.. తెలుగులోనే ఎందుకిలా?

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 10:21 AM

Dhurandhar 2 Movie Collections Effect In Tollywood

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్‌ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న దురంధర్‌-2.. తెలుగులో మాత్రం డీలా పడిపోతోంది. తెలుగు డబ్బింగ్ ‍వర్షన్ కేవలం రూ.25 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. అదే సమయంలో గతేడాది రిలీజైన కాంతార-2 తెలుగు వర్షన్‌లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ దురంధర్-2 విషయానికొస్తే తెలుగు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్‌ అంతగా రావట్లేదని తెలుస్తోంది.

తెలుగులో కలెక్షన్స్ డీలా..

తెలుగులో కలెక్షన్స్‌ తగ్గడానికి కారణాలున్నాయి. ఇక్కడ తక్కువ స్క్రీన్స్‌ కేటాయించడం.. అంతేకాకుండా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం ప్రధానంగా వసూళ్లపై ప్రభావంపై కనిపిస్తోంది. వీటితో పాటు లాంగ్‌ రన్‌టైమ్ 4 గంటల నిడివి వల్ల కొంతమంది ఆడియన్స్‌ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వయొలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ దురంధర్‌-2ను థియేటర్‌లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ కారణాల వల్లే తెలుగులో తక్కువ కలెక్షన్స్ వస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement