‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..? | legal options to adopt stepchildren without fathers approval india | Sakshi
Sakshi News home page

‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..?

Apr 1 2026 11:32 AM | Updated on Apr 1 2026 1:18 PM

legal options to adopt stepchildren without fathers approval india

ఆమె తన మొదటి భర్తతో హిందూ వివాహ చట్టం ద్వారా 2015లో విడాకులు పొందిన తర్వాత నేను ఆమెను 2016లో వివాహం చేసుకున్నాను. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిని తండ్రి తన సంరక్షణలోకి తీసుకున్నాడు కానీ అమ్మాయిల బాధ్యత ఏనాడూ పట్టించుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు 2015 నుండి నా భార్యతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారికి 12 సంవత్సరాలు. నేను వారిని నా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నన్ను వాళ్ళు ‘డాడీ’ అని పిలుస్తారు. అందువల్ల ఇంక నాకు మళ్ళీ పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాను. నా భార్య గతంలో తన మాజీ భర్త నుండి తీవ్రమైన గృహహింసకు గురైంది, ముఖ్యంగా కవల పిల్లలకు (అమ్మాయిలకు) జన్మనిచ్చిన కారణంగా. ఇద్దరు అమ్మాయిలను నేను చట్టపరంగా దత్తత తీసుకుని, నా ఇంటిపేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని నుంచి దత్తతకు అనుమతి పొందడం అసాధ్యం. నా మీద కూడా కక్షధోరణి ఉంటుంది. తండ్రి అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం సాధ్యమా? సాధ్యం కాకపోతే, ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి?
– మచ్చా అనికేత్, విశాఖపట్నం 

ముందుగా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటేనే సంతానం కాదు – ప్రేమానురాగాలకు పేగుబంధమే అవసరం లేదు అని నిరూపించారు. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం.

మీ సమస్యలోని సున్నితత్వాన్ని , భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. భారతదేశంలో, పైగా హిందూ చట్టాలలో పిల్లల తల్లి/తండ్రి బతికే ఉంటే, సాధారణంగా ఏ ఒక్కరి అనుమతి లేకుండా దత్తత సాధ్యం కాదు. మీ కేసులో కూడా తండ్రి అనుమతి కావాలి.
ఎందుకంటే...

1.     దత్తత తీసుకున్న తర్వాత జన్మనిచ్చిన తండ్రి హక్కులు పూర్తిగా ముగుస్తాయి.
2.     మీరు చట్టపరంగా తండ్రిగా మారతారు.
3.     ఆస్తి, వారసత్వ హక్కులు మారతాయి.

ఈ పరిస్థితుల్లో తండ్రి అనుమతి లేకుండా కోర్టు దత్తతకు అనుమతించాలి అంటే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

1.     తండ్రి పిల్లలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారా?
2.     పిల్లలను ఇన్ని సంవత్సరాలుగా చూసుకున్నారా లేదా – కనీసం వారి బాగోగులు పట్టించుకున్నారా లేదా?
3.     తండ్రి హింసాత్మకంగా లేదా పిల్లల పోషణకు అనర్హుడిగా ఉన్నారా?
4.     పిల్లలకు అతని వల్ల హానికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా?

ఈ అంశాలను కోర్టు మాత్రమే నిర్ణయించగలదు – మీ సొంత నిర్ణయాలు చెల్లవు. ముందుగా కస్టడీ/గార్డియన్‌షిప్‌ పొందడం కోసం మీ భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి. పిల్లలు 2015 నుండి తనతోనే ఉన్నారని. తండ్రి బాధ్యతలు నిర్వర్తించలేదని / హింస (ఆర్థిక, మానసిక, శారీరక) చేశాడని, పైన తెలిపిన అంశాలకు ΄ాల్పడ్డాడు అని నిరూపించాలి.

ఆ తర్వాత మీరు దత్తత కోసం కోర్టులో పిటిషన్‌ వేయవచ్చు. అందులోనే తండ్రి అనుమతి అవసరం లేదని కూడా కోర్టును అభ్యర్థించవచ్చు. పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నందున కోర్టు వారి అభి్ర΄ాయం అడగవచ్చు. వారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, జన్మనిచ్చిన తండ్రిపై వారికి ఎటువంటి ప్రేమ లేదు అంటే అది మీకు బలమైన అంశంగా మారుతుంది. చట్టపరంగా దత్తత తీసుకోకుండా సర్టిఫికెట్లలో ఎటువంటి మార్పులు చేయకండి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తల ఎత్తవచ్చు. 

మీ దగ్గరలోని మంచి లాయర్‌ గారిని కలవండి. మీ భార్యకు తన మాజీ భర్తకు జరిగిన కోర్టు వివాదాలు, పత్రాలు, ఒప్పందాలు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళండి. మాజీ భర్త తన పిల్లలను ఏనాడు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆధారాలు సేకరిస్తే మరీ మంచిది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement