ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై దాడి | Janasena Supporters Attack On MLA Arava Sreedhars Victim | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలిపై దాడి

Apr 2 2026 7:28 PM | Updated on Apr 2 2026 7:57 PM

Janasena Supporters Attack On MLA Arava Sreedhars Victim

రైల్వేకోడూరు:  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు హర్షవీణపై దాడికి పాల్పడ్డారు  జనసేన పార్టీ కార్యకర్తలు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు టోల్‌గేట్‌ సమీపంలో ఆమెపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు. 

తొలుత హర్షవీణ వెంట ఉండే గోపీ అనే వ్యక్తిని చితకబాదారు. ఆపై హర్షవీణను మూకుమ్మడిగా ఎటాక్‌ చేశాయి ఆ మూకలు. తనపై దాడి జరిగిన విషయన్ని రైల్వేకోడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు అరవ శ‍్రీధర్‌ బాధితురాలు హర్షవీణ.

కాగా, నాలుగు రోజుల క్రితం  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు మరో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు.  తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్‌ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్‌ కళ్యాణ్‌ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు.

తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు.

మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?,  మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్‌ను నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement