యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు  | British Prime Minister Starmer calls for closer Europe ties as Iran war strains ... | Sakshi
Sakshi News home page

యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు 

Apr 2 2026 4:42 AM | Updated on Apr 2 2026 4:42 AM

British Prime Minister Starmer calls for closer Europe ties as Iran war strains ...

హార్మూజ్‌ను తెరవడానికి త్వరలో అంతర్జాతీయ సదస్సు  

బ్రిటిష్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ప్రకటన 

లండన్‌: ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

 పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్‌ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్‌ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్‌ స్పష్టంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement