అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి | Yv subba reddy comments on amaravati in rajya sabha | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి

Apr 2 2026 3:21 PM | Updated on Apr 2 2026 4:12 PM

Yv subba reddy comments on amaravati in rajya sabha

న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు.  ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్‌ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.

అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా కర్నూల్‌ను జ్యూడీషియల్‌ క్యాపిటల్‌గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు వాకౌట్‌ చేశారు. 

అమరావతి బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement