ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడ‌నున్న సామ్ కర్రాన్‌? | Fact check: Are Sam and Tom Curran joining Zimbabwe? | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడ‌నున్న సామ్ కర్రాన్‌?

Apr 1 2026 5:37 PM | Updated on Apr 1 2026 6:40 PM

Fact check: Are Sam and Tom Curran joining Zimbabwe?

సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌ లు ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికి.. జింబాబ్వే క్రికెట్‌తో వారికి వీడ‌దీయ‌రాని బందం ఉంది. వారి తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడ‌గా.. త‌మ్ముడు బెన్ క‌ర్ర‌న్ ప్ర‌స్తుతం జింబాబ్వే జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా ఉన్నాడు.

అంతేకాకుండా వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ కూడా గతంలో రోడేసియా (ప్రస్తుత జింబాబ్వే) తరఫున ఆడారు. అయితే ఇప్పుడు సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కూడా ఇంగ్లండ్ జ‌ట్టును వ‌దిలి జింబాబ్వే తరఫున ఆడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

జింబాబ్వే క్రికెట్ వర్గాల్లో చురుగ్గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ ఆడమ్ థియో తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. "మాజీ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు సామ్, టామ్ క‌ర్రాన్‌లు ఇప్పుడు జింబాబ్వే క్రికెట్ త‌ర‌పున ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ప్ర‌స్తుతం టామ్ క‌ర్రాన్‌కు జింబాబ్వే జ‌ట్టు తరపున ఆడేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ప్ప‌టికి..సామ్ మాత్రం ఐసీసీ నుంచి అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాడు. 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 త‌ర్వాత ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి" అని ఎక్స్‌లో థియో రాసుకొచ్చాడు. అందుకు సామ్‌, టామ్ జింబాబ్వే జెర్సీలు ధరించిన ఒక ఫోటోను కూడా జోడించాడు. ఇది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక‌య్యారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో, తన ఫాలోవర్లను ఆటపట్టించడానికి థియో ఈ పోస్ట్ చేశారు. 

అంతే త‌ప్ప ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాగా  సామ్ క‌ర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కేప్‌టౌన్‌లో జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకే పౌర‌స‌త్వం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్ద‌రూ.. జింబాబ్వేకు ఆడాలంటే కనీసం నాలుగు ఏళ్లు అక్కడ నివసించాలి. అంతేకాకుండా జింబాబ్వే త‌ర‌పున డొమాస్టిక్ క్రికెట్ ఆడాలి. టామ్ క‌ర్రాన్ ప్ర‌స్తుతం జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉండ‌గా.. సామ్ క‌ర్రాన్ మాత్రం కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు
చదవండి: ICC Rankings: దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌.. ఏకంగా 64 స్ధానాలు

Advertisement
 
Advertisement
Advertisement