దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..! | Akshay Kumar Bhooth Bangla pushed amid Dhurandhar craze | Sakshi
Sakshi News home page

Bhooth Bangla: దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!

Apr 2 2026 9:21 PM | Updated on Apr 3 2026 10:23 AM

Akshay Kumar Bhooth Bangla pushed amid Dhurandhar craze

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్  ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ప్రస్తుతం దురంధర్‌ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్‌ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.

కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement