రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది. ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.


