భారతి ఎయిర్‌టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్! | Airtel World Second Largest Telco Hits 650-Million Customer Milestone | Sakshi
Sakshi News home page

భారతి ఎయిర్‌టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!

Apr 2 2026 6:26 PM | Updated on Apr 2 2026 6:32 PM

Airtel World Second Largest Telco Hits 650-Million Customer Milestone

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్‌టెల్‌కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

ఆఫ్రికాలో.. ఎయిర్‌టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నారు.

ఎయిర్‌టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్‌టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement