పీఎం మోదీ, ఆర్మీ అఫీషియల్స్‌ మీటింగ్‌ వెనుక అసలు సీక్రెట్‌ ఇదే? | Truth Behind PM Modi Emergency Meeting, RetdMajor Srinivas Exclusive Interview | Sakshi
Sakshi News home page

పీఎం మోదీ, ఆర్మీ అఫీషియల్స్‌ మీటింగ్‌ వెనుక అసలు సీక్రెట్‌ ఇదే?

Apr 2 2026 9:31 PM | Updated on Apr 3 2026 10:23 AM

Truth Behind PM Modi Emergency Meeting, RetdMajor Srinivas Exclusive Interview

దేశం మొత్తం నిద్రలో ఉన్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో మూడు గంటలపాటు జరిగిన గోప్య సమావేశం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారించింది. దోవల్ రూపొందించిన "రెడ్ ఫైల్"లో అమెరికా–పాకిస్థాన్ రహస్య ఒప్పందం, ఇరాన్‌పై దాడుల ప్రణాళిక, భారత్‌ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు పూరీ జగన్నాథ, అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, సరిహద్దుల్లో NOTAM జారీ చేయడం వంటి పరిణామాలు దేశం ఒక పెద్ద "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా–పాకిస్థాన్ ఒప్పందం ఇరాన్‌తో ఘర్షణకు దారితీస్తే, పాకిస్థాన్ ఈ పరిస్థితిని భారత్‌పై ఒత్తిడి పెంచడానికి వాడుకోవచ్చనే ఆందోళనలతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ వీడియోను క్లిక్ చేయండి.

 

Advertisement
 
Advertisement
Advertisement