ఉద్యోగం మారినా అంతా ఆటోమేటిక్‌గా.. | pf-auto-transfer-epfo-aadhaar-linking-big-alert | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మారినా అంతా ఆటోమేటిక్‌గా..

Jul 12 2026 12:31 PM | Updated on Jul 12 2026 1:16 PM

pf-auto-transfer-epfo-aadhaar-linking-big-alert

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కోట్లాది మంది వేతన జీవులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత పీఎఫ్ ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌ఓ ప్రవేశపెడుతున్న ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్ మైగ్రేషన్’ ప్రక్రియ ద్వారా ఈ బదిలీ అంతా స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) జరిగిపోతుంది. ఈ సాంకేతిక మార్పు ద్వారా తరచూ ఉద్యోగాలు మారే కార్పొరేట్, ఐటీ రంగాల ఉద్యోగులకు ఇది ఎంతో మేలు జరగనుంది.

ఆధార్ లింకింగ్ ఉంటే చాలు.. క్లియర్!

  • ఈ ఆటోమేటిక్ బదిలీ సదుపాయం సజావుగా సాగాలంటే పీఎఫ్ చందాదారులు ఒక ముఖ్యమైన నిబంధనను పాటించాల్సి ఉంటుంది. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్‌)కు ఆధార్ అనుసంధానమై ఉండటం కీలకం.

  • యూఏఎన్‌-ఆధార్ లింకింగ్ పూర్తయిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ ఖాతాలోని నిధులు, సర్వీస్ హిస్టరీ ఎలాంటి మాన్యువల్ అభ్యర్థనలు లేకుండానే కొత్త ఖాతాలోకి బదిలీ చేయబడతాయి.

  • గతంలో పాత పీఎఫ్ డబ్బులు బదిలీ అవ్వాలంటే ఆన్‌లైన్‌లో ‘ఫారమ్ 13’ సబ్మిట్ చేయడం, పాత లేదా కొత్త యజమానుల డిజిటల్ సంతకం కోసం వేచి చూడటం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇకపై ఆ పాత పద్ధతులకు స్వస్తి పలకవచ్చు.

  • ఖాతాలు సకాలంలో విలీనం కావడం వల్ల ఉద్యోగి పీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీకి ఎలాంటి బ్రేకులు పడకుండా నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఉద్యోగులు తెలుసుకోవలసిన అంశాలు

  • మీ పీఎఫ్ మెంబర్‌ పోర్టల్‌లోకి లాగిన్ అయి ఆధార్ స్టేటస్ వెరిఫైడ్ అని ఉందో లేదో చూసుకోవాలి.

  • పీఎఫ్ రికార్డుల్లో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు.. ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోలాలి.

  • మీ ప్రస్తుత బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ పీఎఫ్ పోర్టల్‌లో యాక్టివ్‌గా అప్‌డేట్ అయి ఉండాలి.

ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement