ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్! | Aadhaar Biometric Update Free For Children Till September 30 2026 | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్!

Jul 4 2026 4:38 PM | Updated on Jul 4 2026 4:52 PM

Aadhaar Biometric Update Free For Children Till September 30 2026

భారతదేశంలో ఆధార్ ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం చాలా అవసరం. కాబట్టి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని చెబుతోంది.

పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కంటి (ఐరిస్) నమూనాలు, ముఖ ఆకృతి కొంత మారుతుంది. అందువల్ల చిన్న వయస్సులో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు కాలక్రమేణా సరైన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యను నివారించడానికి యూఐడీఏఐ ఈ అప్‌డేట్‌ను తప్పనిసరి చేసింది. దీనివల్ల ఆధార్ వివరాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి.

ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. ఎందుకంటే వీరికి స్కూల్, కాలేజీల్లో ప్రవేశాలు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్‌లో ఉండటం అవసరం.

యూఐడీఏఐ ప్రకారం.. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోపు అప్‌డేట్ చేయించుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలతో కలిసి సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో తీసి అప్‌డేట్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement