ఆధార్‌ యాప్‌తో ఉచితంగా ఈమెయిల్‌ అప్‌డేట్‌ | Aadhaar App Launches Email Update Feature | Sakshi
Sakshi News home page

ఆధార్‌ యాప్‌తో ఉచితంగా ఈమెయిల్‌ అప్‌డేట్‌

Jul 4 2026 4:41 AM | Updated on Jul 4 2026 4:41 AM

Aadhaar App Launches Email Update Feature

న్యూఢిల్లీ: ప్రత్యేకంగా ఆధార్‌ సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారానే ఉచితంగా ఈమెయిల్‌ని అప్‌డేట్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ వెల్లడించింది. జూలై 1 నుంచి 6 నెలల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌గా ఉంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని యూఐడీఏఐ తెలిపింది.

సర్వీస్‌ని ఆధార్‌ యాప్‌లో ప్రవేశపెట్టిన 2 రోజుల్లోనే 2,50,000 మంది దీన్ని వినియోగించుకున్నట్లు వివరించింది. ఆధార్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ని ప్రవేశపెట్టిన ఐదు నెలల్లోనే 3.1 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. ఇప్పటివరకు 40 లక్షల మంది కొత్త ఆధార్‌ యూప్‌ను ఉపయోగించుకుని తమ మొబైల్‌ నంబర్లను అప్‌డేట్స్‌ చేసుకోగా, 10 లక్షల మంది అడ్రస్‌లను అప్‌డేట్‌ చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement