నెమ్మదించిన ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్‌ సేవలు | EPFO Online Services Slowdown – What You Must Know to Avoid Trouble | Sakshi
Sakshi News home page

నెమ్మదించిన ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్‌ సేవలు

Jul 8 2026 12:29 PM | Updated on Jul 8 2026 12:30 PM

EPFO Online Services Slowdown – What You Must Know to Avoid Trouble

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన సాంకేతిక వ్యవస్థను ఆధునీకరించే (సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌) ప్రక్రియలో ఉన్నందున ఆన్‌లైన్ సేవల్లో తాత్కాలిక జాప్యం చోటుచేసుకుంటోంది. దీనివల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్లు, విత్‌డ్రాయల్స్ (ఉపసంహరణలు) సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చందాదారులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు కొన్ని విషయాలను, జాగ్రత్తలను గమనించాలని ఈపీఎఫ్‌ఓ సూచించింది.

చేయకూడనివి ఇవే..

  • ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్‌ అవర్స్‌) ఆన్‌లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేయడానికి లేదా లాగిన్ అవ్వడానికి పదేపదే ప్రయత్నించవద్దు. దీనివల్ల సర్వర్‌లపై లోడ్ మరింత పెరిగి సిస్టమ్ నెమ్మదిస్తుంది.

  • ఒకసారి క్లెయిమ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత అది ప్రాసెసింగ్‌లో ఉన్నప్పుడు మళ్లీ అదే క్లెయిమ్ కోసం డూప్లికేట్ అభ్యర్థనలను పంపకండి.

  • ఇది సిస్టమ్ లోడ్‌ను పెంచడమే కాకుండా మీ అప్లికేషన్ తిరస్కరణకు దారితీయవచ్చు.

  • వీలైనంత వరకు ఉదయం పూట లేదా రాత్రి వేళల్లో (ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ తక్కువగా ఉండే సమయాల్లో) పోర్టల్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

జాప్యానికి ప్రధాన కారణాలు

ఈపీఎఫ్‌ఓ తన ఐటీ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేయడానికి, భవిష్యత్తులో లావాదేవీలను వేగవంతం చేయడానికి ఈ సాంకేతిక అప్‌గ్రేడ్‌ను చేపట్టింది. ప్రస్తుతం డేటా మైగ్రేషన్, సిస్టమ్ స్టెబిలైజేషన్ జరుగుతుండటం వల్ల తాత్కాలికంగా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సేవలు మరింత వేగంగా, సురక్షితంగా అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement