హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌ | Liquor shops to remain closed in Hyderabad for Hanuman Jayanti | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌

Apr 1 2026 6:47 PM | Updated on Apr 1 2026 9:30 PM

Liquor shops to remain closed in Hyderabad for Hanuman Jayanti

సాక్షి,హైదరాబాద్‌: నగర పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు  ఉత్తర్వులు జారీ చేశారు. 

తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యాక్ట్, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం, 02.04.2026 ఉదయం 06.00 గంటల నుండి 03.04.2026 ఉదయం 06.00 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (టాడీ షాప్స్), బార్లు, రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement