ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..! | NRI installs Statue of Liberty replica atop Jalandhar home | Sakshi
Sakshi News home page

ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..! కారణం తెలిస్తే విస్తుపోతారు

Mar 22 2026 11:58 AM | Updated on Mar 22 2026 12:20 PM

NRI installs Statue of Liberty replica atop Jalandhar home

అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్‌లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్‌లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..

పంజాబ్‌లోని ఎన్నారై గుర్జీత్‌ సింగ్‌ మథారు జలంధర్‌లోని కిషన్‌ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్‌గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా. 

రీజన్‌ ఏంటంటే..
గుర్జీత్‌ సింగ్‌ న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం  జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్‌లోనే నివశిస్తున్న గుర్జీత్‌ సింగ్‌కి ప్రతి ఏడాది భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. 

దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్‌లోని ఓ చిన్న సైజ్‌ న్యూయార్క్‌ అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: పైలట్‌ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్‌ జర్నీలు ఏంటో తెలుసా ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement