టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు | Grand Shri Ram Navami celebrations in Tokyo Japan | Sakshi
Sakshi News home page

టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Mar 29 2026 11:06 AM | Updated on Mar 29 2026 11:11 AM

Grand Shri Ram Navami celebrations in Tokyo Japan

జపాన్‌లోని టోక్యో నగరం నిషిఓజిమ(Nishiojima) వేదికగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తాజ్ - తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజలు, భారతీయ కమ్యూనిటీ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో  బ్రాహ్మణ పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

భక్తులందరూ అత్యంత భక్తితో ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాద వితరణ, సంప్రదాయబద్ధమైన భోజన ఏర్పాట్లు చేశారు. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ, మన పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ భోజన కార్యక్రమం సాగింది.

టోక్యో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఒకచోట చేరి ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాజ్ (TAJ) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 

సుదూర తీరంలో ఉంటూ శ్రీరామనవమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన తాజ్ ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement