హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర | Grand Sri Rama Navami Procession Under Tight Security in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర

Mar 27 2026 2:45 PM | Updated on Mar 27 2026 3:09 PM

  Grand Sri Rama Navami Procession Under Tight Security in Hyderabad

హైదరాబాద్‌: నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్‌ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు శోభాయాత్ర ఉంటుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు.

శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు.

ఈ యాత్ర ఇవాళ రాత్రి 10 గంటల‍్లోగా ముగిసేలా పక్కా రూట్ మ్యాప్‌ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.

ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3,000 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement