డీజిల్‌..పెట్రో.. ఇదేమిట్రో! | petrol diesel shortage rumours hyderabad long-queues | Sakshi
Sakshi News home page

డీజిల్‌..పెట్రో.. ఇదేమిట్రో!

Mar 27 2026 8:00 AM | Updated on Mar 27 2026 12:15 PM

petrol diesel shortage rumours hyderabad long-queues

హైదరాబాద్‌: అసలే కొరత.. ఆపై అక్రమ విక్రయం కొంత.. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంస్థల నిబంధనల వల్ల కొన్ని పెట్రోల్‌ బంక్‌లు నో స్టాక్‌ బోర్డు పెడుతున్నాయంటూ వచి్చన వదంతులకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్‌కు కటకట ఏర్పడిందంటూ వచి్చన వాహనదారులతో బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. 

తెరిచి ఉన్న ఏ బంకు వద్ద చూసినా డీజిల్, పెట్రోల్‌ కోసం వాహనదారుల బారులే బారులు.. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి ఆలి్వన్‌ కాలనీలోని ఓ బంక్‌ నిర్వాహకులు.. విడిగా బాటిళ్లు, క్యాన్లు పట్టుకొని వచి్చనవారికి కూడా డీజిల్, పెట్రోల్‌ విక్రయిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. ప్రమాదకరం కూడా. అధికారులు నిఘా పెట్టి అక్రమ విక్రయాన్ని అడ్డుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.               

Advertisement
 
Advertisement
Advertisement